పరువు నష్టం కేసులో తెహల్కా పత్రిక మాజీ ఎడిటర్ ఇన్ చీఫ్ తరుణ్ తేజ్‌పాల్‌కు ఢిల్లీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2001లో డిఫెన్స్ కొనుగోళ్లలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. 2002లో మేజర్ జనరల్ ఎంఎస్ అహ్లూవాలియా పరువు నష్టం కేసు వేశారు.
ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన బొగ్గు లెవీ కుంభకోణానికి సహకరించారనే ఆరోపణలతో ఐఏఎస్ అధికారిణి రాను సాహును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
అవినీతి నిరోధక శాఖకు రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. అవినీతి కేసులో ఇద్దరు ప్రభుత్వ అధికారులను అరెస్టు చేయగా.. అస్సాంలోని ధుబ్రి జిల్లాలో ఒకరి నివాసంలో రూ.2.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
బంగ్లాదేశ్‌లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఝలకతి సదర్ ఉపజిల్లాలోని ఛత్రకాండ ప్రాంతంలో శనివారం బస్సు రోడ్డు పక్కన ఉన్న చెరువులో పడింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతి చెందగా.. 35 మందికి పైగా గాయపడ్డారు.
బీహర్‌లోని అర్రా జిల్లాలో రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఆ మహిళ తన ముగ్గురు చిన్నారులతో సహా రైలు ముందు దూకింది. ఈ ఘటనలో సదరు మహిళ మృతి చెందగా.. ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.
వచ్చే నెలలో దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. కాగా బ్రిక్స్ సదస్సుకు సంబంధించి రష్యా విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. బ్రిక్స్ దేశాలు వచ్చే నెలలో జరిగే తమ శిఖరాగ్ర సమావేశంలో సీమాంతర వాణిజ్యం కోసం దీర్ఘకాలిక చెల్లింపు వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై చర్చిస్తాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
2008 నాటి హత్య కేసులో దోషిగా తేలిన వ్యక్తిని నిర్దోషిగా ప్రకటిస్తూ.. ఓ నేరాన్ని రుజువు చేయడానికి ప్రత్యక్ష సాక్షులు ఉన్నప్పుడు.. ఘటనకు గల కారణాన్ని నిరూపించాల్సిన అవసరం లేదని, ప్రత్యక్ష సాక్షి లేనప్పుడు మాత్రం నేరానికి ప్రేరేపించిన కారణం కీలకంగా మారుతుందని సుప్రీంకోర్టు పేర్కొంది.
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో దారుణం జరిగింది. సుగంధ ద్రవ్యం(Perfume) చల్లుకుని బయటికి వెళుతున్న భార్యతో జరిగిన గొడవలో ఓ వ్యక్తి తన భార్యపై కాల్పులు జరిపాడు.
ప్రధాని నరేంద్ర మోడీపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తీవ్రంగా విమర్శించారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో పర్యటించేందుకు ప్రధాని ఎందుకు దూరంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని ఇర్షల్‌వాడి గ్రామంలో ఇటీవల జరిగిన కొండచరియలు విరిగిపడటంతో తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలను మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే దత్తత తీసుకోనున్నట్లు శివసేన తెలిపింది.