ట్విట్టర్ అధిపతి ఎలాన్ మస్క్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. ట్విటర్ ప్లాట్‌ఫామ్ బ్రాండ్ మార్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ప్రకటించారు. చైనాకు చెందిన యాప్ ‘వీ చాట్’ మాదిరిగానే సూపర్ యాప్‌ను రూపొందించాలని ఆయన యోచిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 808 ఎఫ్‌ఎం రేడియో స్టేషన్లను ఏర్పాటుచేయడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మూడో విడత ఈ-వేలం నిర్వహించనుందని కేంద్ర సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు.
వారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే సోమవారం ఉదయం ప్రారంభమవుతుందని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. ఆదివారం నాడు ఏఎస్‌ఐ బృందం కావాల్సిన అన్ని పరికరాలతో వారణాసికి చేరుకుంది.
పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్ నేపథ్యం, భారతదేశంలోకి ఆమె అక్రమ ప్రవేశంపై విచారణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. ఒక భారతీయ మహిళ ఇప్పుడు తన ప్రేమికుడిని కలవడానికి సరిహద్దు దాటి వెళ్లింది.
6 నుంచి 12 తరగతుల బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్లు అందించాలని, అన్ని ప్రభుత్వ-ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యేక మరుగుదొడ్డి సౌకర్యం కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది.
దేశవ్యాప్తంగా టొమాటో ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్న నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మహిళా అభివృద్ధి, శిశు పోషకాహార శాఖ సహాయ మంత్రి ప్రతిభా శుక్లా ఆదివారం టమాటాలు ఖరీదైనవి అయితే, వాటిని ఇంట్లో పండించండి లేదా వాటిని తినడం మానేయాలని ప్రజలకు సూచించారు.
కేరళ రాష్ట్ర రాజధాని నుంచి దుబాయ్‌కి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఆదివారం, విమానంలోని ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్‌లో సమస్య కారణంగా టేకాఫ్ అయిన రెండు గంటలకే తిరిగి వచ్చిందని తిరువనంతపురం విమానాశ్రయ అధికారులు తెలిపారు.
మణిపూర్‌లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా.. కాంగ్రెస్ మణిపూర్ అంశంపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్ బీరెన్ సింగ్ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం మణిపూర్‌లో శాంతిస్థాపన దిశగా ఉద్యమం ఉండదని కాంగ్రెస్ ఆదివారం పేర్కొంది.
మణిపూర్‌లో జాతి హింసపై పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రతిష్టంభన కొనసాగుతుండగా, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆదివారం ఈ అంశంపై చర్చకు రావాలని ప్రతిపక్ష పార్టీలకు చేతులను జోడించి విజ్ఞప్తి చేశారు.