బీహార్ నలందా జిల్లాలోని కుల్ గ్రామంలో ఆదివారం మూడేళ్ల బాలుడు బోరుబావిలో పడిపోయాడు. స్థానికులు అధికారులకు సమాచారం అందించడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. బాలుడిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది.
సెంట్రల్ ఆఫ్ఘనిస్తాన్‌లో కుండపోత వర్షం కారణంగా రాత్రిపూట ఆకస్మిక వరదలు సంభవించి మరణించిన వారి సంఖ్య 26కి పెరిగిందని, 40 మందికి పైగా గల్లంతయ్యారని అధికారులు ఆదివారం తెలిపారు.
ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ నేతృత్వంలోని సమిష్టి నాయకత్వంలో కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని, పార్టీ గెలిస్తే, సీఎం పదవికి పరిగణించబడే వరుసలో బఘేల్ మొదటి స్థానంలో ఉంటారని ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ డియో ఆదివారం అన్నారు.
దేశవ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా పలు రాష్ట్రాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. యమునా నది నీటి మట్టం ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. ఢిల్లీలోని పాత రైల్వే వంతెన వద్ద 206.26 మీటర్ల స్థాయికి చేరుకుంది.
బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ జుగుప్సాకరమైన పనికి పాల్పడ్డాడు. డ్రైవింగ్ చేస్తూనే మహిళా ప్యాసింజర్ ఎదుట హస్తం ప్రయోగం చేశాడు. ఈ సంఘటన గురించి ఆ యువతి సోషల్ మీడియా వేదికగా బయట పెట్టింది. దీంతో పాటు బైక్ నడుపుతూ హస్తప్రయోగం చేశాడని, గమ్యస్థానంలో దించిన తర్వాత తనను వాట్సాప్‌లో వేధించాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది.
గత కొన్ని నెలలుగా విమానాల్లో వికృత ప్రవర్తన సర్వసాధారణంగా మారింది. ఒక ప్రయాణికుడు మరొక ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడం, విమానయాన సంస్థలు ప్రయాణికులను విమానాశ్రయంలో వదిలివేయడం నుంచి విమానంలో ఒక మహిళను తేలు కుట్టడం వరకు ఇటీవల విమానయాన పరిశ్రమలో కొన్ని అసాధారణ సంఘటనలు జరిగాయి.
మధ్యప్రదేశ్‌లోని నార్సింగ్‌పూర్, కరేలీ స్టేషన్‌ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పిందని, ఆ మార్గంలో రైలు రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని అధికారి ఒకరు ఆదివారం తెలిపారు.
చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్‌కు అత్యంత సన్నిహితుడు, చైనా విదేశాంగమంత్రి క్విన్ గాంగ్ గత నెలరోజులుగా ఆచూకీ లేకుండా పోవడం చైనాలో కలకలం రేపుతోంది. విదేశాంగ మంత్రి కనిపించకుండా పోవడం సాధారణ విషయం కాదు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. మంత్రి, ముఖ్యమంత్రి పదవులకు సంబంధించి ఆయన కీలక వ్యాఖ్యలు చేయడంతో కర్ణాటకలోని అధికార పార్టీలో కలవరం మొదలైంది.