2024 సార్వత్రిక ఎన్నికల్లో బీహార్ రాష్ట్రంలో బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ జోస్యం చెప్పారు. విపక్షాలు కలిసి ఇండియా కూటమిని ఏర్పాటు చేయడంతో బీజేపీ తీవ్ర భయాందోళనకు గురవుతోందని నితీష్ కుమార్ ఈరోజు అన్నారు.
రాజ్యసభలో ఢిల్లీ సర్వీసెస్ బిల్లుకు సంబంధించిన తీర్మానంలో ఐదుగురు ఎంపీల సంతకాలను ఫోర్జరీ చేసినందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ రాఘవ్ చద్దాపై ప్రివిలేజ్ కమిటీ తన నివేదికలను సమర్పించే వరకు రాజ్యసభ నుంచి సస్పెండ్ చేయబడ్డారు.
ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలోని చిన్న పట్టణంలో గత జులై 29న అడవి పుట్టగొడుగులు తిని ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరు మృత్యువుతో పోరాడుతుండగా.. ఈ కేసు స్థానికంగా కలకలం రేపింది. ఆస్ట్రేలియన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. ఎలాంటి క్లూస్ దొరకడం లేదు.
47 సంవత్సరాలలో తన మొట్టమొదటి చంద్ర ల్యాండింగ్ వ్యోమనౌకను ప్రయోగించడానికి రష్యా తన తుది సన్నాహాలు చేసింది. చంద్రుని దక్షిణ ధృవం మీద గణనీయమైన నీటి మంచు నిక్షేపాల ఉనికిని కనుగొనడానికి రష్యా 25 సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ర్చింజన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ పాత వెర్షన్ ఉపయోగిస్తున్న వారు తక్షణమే అప్ డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ భద్రతా సంస్థ సీఈఆర్టీ-ఎన్ (కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఆఫ్ ఇండియా) అప్రమత్తం చేసింది.
ఇటీవల ఓలా, ఉబెర్ క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికులతో అనుచితంగా ప్రవర్తించినట్లు కేసులు నమోదైన ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా బెంగుళూరులో ఉబెర్ డ్రైవర్ మహిళా ప్రయాణికురాలు, ఆమె కొడుకుపై దాడికి పాల్పడడం కలకలం రేపింది. తప్పు క్యాబ్‌లోకి ప్రవేశించినందుకు 48 ఏళ్ల మహిళ, ఆమె కొడుకుపై దాడి చేశాడు.
మోడీ సర్కారుపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ప్రధాని మోదీ స్పందించడంతో ప్రతిపక్షాలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశాయి. వాకౌట్‌పై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ప్రశ్నలు లేవనెత్తే వారికి సమాధానాలు వినే ధైర్యం లేదంటూ ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
ప్రధాని మోదీ గురువారం కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. భారతదేశాన్ని అవమానించడంలో ఆ పార్టీ ఆనందం పొందుతుందని అన్నారు. ఆ పార్టీ ఏ చిన్న సమస్యనైనా తీసుకుంటుందని, భారతదేశాన్ని పరువు తీయడానికి విలేకరుల సమావేశాలు నిర్వహిస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ.. ఆ పార్టీపై భారత ప్రజలకు విశ్వాసం లేదని అన్నారు.