అవిశ్వాసం పెట్టిన విపక్షాలకు ప్రధాని నరేంద్ర మోడీ ధన్యవాదాలు తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై చర్చలో ప్రధాని మోడీ ప్రసంగించారు. దేవుడే అవిశ్వాసం పెట్టాలని విపక్షాలకు చెప్పారని ఆయన అన్నారు. మూడు రోజులుగా చాలామంది మాట్లాడారని.. 2018లో కూడా అవిశ్వాసం పెట్టారు.
మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి పారిపోతున్న రోహింగ్యా శరణార్థులను తీసుకెళ్తున్న పడవ ఈ వారం సముద్రంలో మునిగిపోవడం వల్ల దాదాపు 17 మంది మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారని మునిగిపోయారని అధికారులు గురువారం తెలిపారు.
జాతి హింసతో అట్టుడికిపోతున్న ఈశాన్య రాష్టమైన మణిపూర్‌లో అకృత్యాలు ఆగడం లేదు. అక్కడి మహిళలపై జరుగుతున్న ఘోరాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశాన్ని కుదుపేసిన సంగతి తెలిసిందే. పార్లమెంట్‌లోని ఉభయసభల్లోనూ నిరసన జ్వాలలు చల్లారకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది.
మణిపూర్‌లో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై ప్రతిపక్షాలు చేస్తున్న దాడులపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఘాటుగా స్పందించారు. డీఎంకే ఎంపీలు చేసిన వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చే క్రమంలోనే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అంశాన్ని ప్రస్తావించారు.
దేశంలో ద్రవ్యోల్బణం కారణంగా కూరగాయల ధరలు మండిపోతున్నాయి. బెండకాయ, పొట్లకాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, క్యాప్సికమ్‌తో సహా అన్ని రకాల ఆకుకూరలు ఇప్పుడు ప్రియం అయ్యాయి. ఇప్పటికీ టమాటా కూడా అత్యధిక ధర పలుకుతోంది.
మచిలీపట్నంలో ప్రముఖ వైద్యుడి భార్య డాక్టర్ రాధ దారుణంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. జవ్వారుపేటకు చెందినడాక్టర్ రాధను గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేసిన కేసులో కీలక పురోగతి లభించింది.
విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్‌సీపై ఉభయుల మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
పాము, ముంగిస ఒకదానికి ఒకటి తారసపడ్డాయంటే..ఇక భీకర పోరే. అవి పొట్లాడుకున్న దృశ్యాలు మనం గతంలో చూసే ఉంటాం. అయితే నడిరోడ్డుపై తాచుపాము, ముంగిస భీకరంగా దాడి చేసుకుంటున్న వీడియో ఒకటి తాజాగా వైరల్ అయ్యింది.