26 రాజకీయ పార్టీల ప్రతిపక్ష కూటమిని ‘INDIA’ అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రతిపక్ష కూటమి పేరు INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అని తెలిసిందే.
రాజస్థాన్‌లో దారుణ ఘటన జరిగింది. రక్షించాల్సిన పోలీసే ఓ దళిత వ్యక్తిపై అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితునిపై మూత్ర విసర్జన చేశాడు. మూత్రం పోయడమే కాకుండా స్థానిక ఎమ్మెల్యే కాళ్లు నాకించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై క్రై బ్రాంచ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కమీషన్ (లంచం) తీసుకున్నట్లు రుజువైతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు.కమీషన్ వసూలు చేశారని ఆరోపించినందుకు మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోకల వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్, వారి ఆరోపణలు అవాస్తవమని తేలితే ఇద్దరు బీజేపీ నాయకులు రాజకీయ రిటైర్మెంట్ ప్రకటిస్తారా అంటూ సవాల్ విసిరారు.
మణిపూర్‌లో మహిళలు ఘోరమైన అఘాయిత్యాలకు గురవుతున్న తీరుపై వేదన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు.. ఓ వర్గానికి అణిచివేత సందేశాన్ని పంపేందుకు ఆకతాయిలు లైంగిక హింసకు పాల్పడుతున్నారని, దీనిని రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.
హుజన్ సమాజ్ పార్టీ (BSP) ఈ ఏడాది చివరలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం తన మొదటి ఏడుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. అభ్యర్థులను ప్రకటించిన ఏడు స్థానాల్లో ప్రస్తుతం నాలుగు అధికార బీజేపీ, మిగిలిన మూడు కాంగ్రెస్ చేతిలో ఉన్నాయి.
ప్రముఖ మొబైల్ స్టోర్స్‌లలో ఒకటైన లాట్ మొబైల్స్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ మాదాపూర్‌లోని ఆ సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ సంస్థ డైరెక్టర్ ఎం. అఖిల్ ఆఫర్స్‌ను వెల్లడించారు.
ఆఫ్రికన్ దేశమైన నైజర్‌లోని భారతీయ పౌరులను వీలైనంత త్వరగా దేశం విడిచి వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అక్కడి పరిస్థితులను వివరిస్తూ వీలైనంత త్వరగా నైజర్ వదిలి వెళ్లాలని భారత ప్రభుత్వం ఆగస్టు 11న భారతీయ పౌరులందరికీ సూచించింది.
క్రిమినల్ చట్టాలను మార్చే ఉద్దేశంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లను పునరుద్ధరిస్తూ కేంద్ర ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టింది.
సిరియా తూర్పు ప్రాంతంలో సిరియా సైనికులు ప్రయాణిస్తున్న బస్సుపై ముష్కరులు జరిపిన దాడిలో 23 మంది సిరియన్ సైనికులు మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారని సిరియన్ అబ్జర్వేటరీ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున ఈ దుర్ఘటన జరిగింది.
లోక్‌సభలో మణిపూర్ హింసాత్మక ఘటనలపై చర్చ జరుగుతుండగా.. ప్రధాని నరేంద్ర మోదీ గురువారం పార్లమెంటులో చేసిన ప్రసంగంపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శుక్రవారం విరుచుకుపడ్డారు.