నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA).. కొత్తగా కేంద్రం తీసుకొచ్చిన "పీఎం విశ్వకర్మ"కు ఆమోదం తెలిపింది. మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధానమంత్రి ప్రకటించిన ఈ పథకం ద్వారా 30 లక్షల మంది హస్తకళాకారులు, వారి కుటుంబాలకు రాయితీపై వడ్డీ రేటుతో పూచీకత్తు రహిత రుణాలను అందించడం ద్వారా ప్రయోజనం అందిస్తుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
రాజస్తాన్‌లోని కోటా.. ప్రవేశ పరీక్షల కోచింగ్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు విద్యార్థి ఆత్మహత్యలకు కోటలా మారింది. ఈ నెలలోనే నలుగురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 20 మంది నిండు ప్రాణాలను తీసుకున్నారు.
బాలీవుడ్ నటి జాక్విలిన్ ఫెర్నాండెజ్‌కు ఢిల్లీ కోర్టులో భారీ ఊరట లభించింది. సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన రూ. 200 కోట్ల రూపాయల మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జాక్వెలిన్ ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు అనుమతినిచ్చింది.
ఎన్‌సీపీ అగ్రనేత శరద్ పవార్ లేదా ఆయన కుమార్తె సుప్రియా సూలేకు కేంద్ర క్యాబినెట్ బెర్త్ ఆఫర్ చేసినట్లు కాంగ్రెస్ నాయకుడు, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ మీడియా కథనంపై స్పందిస్తూ, తనను ఎవరూ సంప్రదించలేదని సుప్రియా సూలే చెప్పారు.
ఇజ్రాయెల్‌లో తవ్వకాల్లో ఓ పురావస్తు ఆవిష్కరణ బయటపడింది. ఇజ్రాయెల్‌లోని పురాతన నగరమైన టెల్ ఎరానీలో 5,500 ఏళ్ల కాలం నాంటి పురాతన రాయి, మట్టి ఇటుకతో నిర్మించిన గేటును పరిశోధకులు కనుగొన్నారని ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ మంగళవారం ప్రకటించింది.
దేశవ్యాప్తంగా కేసుల దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన పోలీసులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మెడల్స్ ప్రకటించింది. కేంద్ర హోంశాఖ దేశవ్యాప్తంగా 140 పోలీసులను ఎంపిక చేయగా.. ఏపీ, తెలంగాణ నుంచి 10 మంది ఎంపికయ్యారు.
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)పై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంచాయతీ ఎన్నికల సమయంలో ఆ పార్టీ రక్తంతో ఆడుకుందని అన్నారు.
మణిపూర్‌లో అక్రమ వలసదారులు, మిలిటెంట్ల సమస్యను ఒక్కసారిగా పరిష్కరించడానికి సర్జికల్ స్ట్రైక్ వంటి ప్రభావవంతమైన చర్య జరగాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) నాయకుడు ఎం.రామేశ్వర్ సింగ్ అన్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం భారతీయ న్యాయ సంహిత బిల్లు-2023ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సమీక్ష కోసం పార్లమెంట్‌కు స్టాండింగ్ కమిటీకి ప్రతిపాదిత బిల్లు పంపబడింది.