Supreme Court: ‘ఇండియా’ పేరుపై పిటిషన్.. తిరస్కరించిన సుప్రీంకోర్టు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: 26 రాజకీయ పార్టీల ప్రతిపక్ష కూటమిని ‘INDIA’ అనే పదాన్ని ఉపయోగించకుండా నిరోధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ప్రతిపక్ష కూటమి పేరు INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్) అని తెలిసిందే. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించేందుకు నిరాకరించింది. ‘మీరెవరు? మీ ఆసక్తి ఏమిటి? ఎన్నికల నిబంధనల ఉల్లంఘన జరిగితే ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించండి.. మీకు పబ్లిసిటీ కావాలి, పూర్తి ప్రచారం కావాలి’ అని ధర్మాసనం పేర్కొంది. రాజకీయాల్లో నైతికతను నిర్ణయించడం లేదని.. దీనిపై ప్రజలు సమయాన్ని వృథా చేయడం బాధాకరమని జస్టిస్ కౌల్ అన్నారు.
Also Read: Mobiles Ban In School: స్కూల్స్ లో మొబైల్ ఫోన్స్ నిషేధం.. ఉత్తర్వులిచ్చిన ఢిల్లీ సర్కార్
Also Read
- School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
- Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
కేసును ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఆదేశించడంతో.. బెంచ్ న్యాయవాది అభ్యర్థనను అనుమతించి, పిటిషన్‌ను ఉపసంహరించుకున్నట్లు కొట్టివేసింది. అన్ని మీడియా ఏజెన్సీలు ప్రతిపక్ష కూటమికి “I.N.D.I.A” పేరును ఉపయోగించకుండా ఉండేలా ఒక నియంత్రణను ఆమోదించడానికి ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్ కోరింది. ఈ కూటమికి చెందిన పార్టీ కార్యకర్తలు రాబోయే ఎన్నికలలో కేవలం దేశానికి వ్యతిరేకంగా బీజేపీ పోరాడుతుందన్న తప్పుడు కథనాన్ని సాధారణ ప్రజల మనస్సుల్లో సృష్టించేందుకు నినాదాలు చేస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Operation Firewall 2026: పాక్ ఏజెంట్లకు సహకారం.. బీహార్‌లో ఇద్దరిని అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం
-
School Holidays: అర్నబ్ తుఫాన్ ప్రభావం.. సెలవులు పొడిగించిన విద్యాశాఖ!
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!