బీహార్ రాష్ట్రంలో దారుణం జరిగింది. అరారియా జిల్లాలో స్థానిక జర్నలిస్టును గుర్తు తెలియని దుండగులు ఈ రోజు ఉదయం అతని ఇంటి వద్ద కాల్చి చంపినట్లు బీహార్ పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన రాణిగంజ్ బజార్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
పుంగనూరు అల్లర్లలో కొత్త కోణాలు బయటపడ్డాయి. చంద్రబాబు పర్యటనకు 4 రోజుల ముందే అల్లర్లకు టీడీపీ ప్లాన్ చేసినట్లు తేలింది. టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు అనుచరుల వాంగూల్మంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై విద్యుత్ జేఏసీ - యాజమాన్యాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. విద్యుత్ ఉద్యోగుల రివైజ్డ్ పే స్కేళ్లను యాజమాన్యం ఖరారు చేసింది. సింగిల్ మాస్టర్ స్కేల్‌తో కూడిన పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సంతకాలు చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
స్కూల్‌కి ఎవరైనా కూడా స్కూల్‌బ్యాగ్ , బుక్స్ , లంచ్ బాక్స్‌తో వెళ్తారు. ఇక అంతకంటే ఎక్కువ ఎవరికీ అవసరం కూడా ఉండదు. మరీ చిన్నపిల్లలు అయితే , స్కూల్‌కి కొంచెం స్నాక్స్ తీసుకోని వెళ్లి హాయిగా చదువుకొని, స్నేహితులతో ఆడుకొని ఇంటికి వస్తారు.
కొందరు రాజకీయ నాయకులు స్వార్థం కోసం పన్నుతున్న వ్యూహాలకు సాధారణ జనాలు బలి అవుతున్నారు. హిందు, ముస్లిం భాయ్ భాయ్ అంటూ కలిసి ఉండాల్సిన వాళ్లు.. పరస్పర దాడులకు పాల్పడుతున్నారు. ఒక గ్రూపుగా ఏర్పడి.. ఒంటరిగా వెళ్తున్న వారిని టార్గెట్ చేసుకొని, వారిపై ఎటాక్ చేస్తున్నారు.
కోర్టుల్లో విచారణ, తీర్పుల సందర్భంలో లింగ వివక్షకు తావు లేకుండా పదాలను వినియోగించడంపై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండే మూస పదజాలానికి సర్వోన్నత న్యాయస్థానం స్వస్తి పలికింది.
పాకిస్థాన్‌లోని ఫైసలాబాద్‌లో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. క్రిస్టియన్ మైనారిటీలపై ఓ వర్గానికి చెందిన ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు. చర్చీలను ధ్వంసం చేస్తూ.. మైనారిటీల అణిచివేత చర్యలకు పాల్పడ్డారు.
చంద్రబాబు విజన్ 2047 ఒక దుస్సాహసమని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. జనం అంటే ఏమీ తెలియని అమాయకులు, పిచ్చోళ్ళని చంద్రబాబు నమ్మకమంటూ ఆయన ఎద్దేవా చేశారు.