కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని ఓ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గది బెడ్ కింద రూ.854 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఇటీవల కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీఆర్‌ఎస్ పార్టీతో చేరారు. జనగామ జిల్లా కేంద్రంలోని వైద్య కళాశాల మైదానంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభా వేదికగా ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు.
లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ అమెరికాలో తన కార్ల చెల్లింపుల కోసం క్రిప్టోకరెన్సీలో చెల్లింపును అనుమతించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ సంపన్న కస్టమర్ల అభ్యర్థనల మేరకు ఈ పథకాన్ని యూరప్‌కు విస్తరిస్తుందని కంపెనీ మార్కెటింగ్, వాణిజ్య చీఫ్ ఎన్రికో గల్లీరా మీడియాతో చెప్పారు.
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బెజవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పించింది. టీటీడీ బోర్డు సభ్యులు మీకా శేషు బాబు , గాదిరాజు వెంకట సుబ్బరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
కుపెర్టినో ఆధారిత టెక్ దిగ్గజం ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2, ఎయిర్‌పాడ్స్ ప్రో (యూఎస్‌బీ-సి) వేరియంట్‌లతో పాటు ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసింది. టెక్ మేకర్ బాక్స్‌లో ఐఫోన్‌ను అప్‌డేట్ చేయడానికి కొత్త ఫీచర్‌ను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఏపీలో శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ 'కీ' విడుదలైంది. ఈ రెండు రోజుల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగియగా.. ఆదివారం సాయంత్రం ప్రాథమిక కీ విడుదలైంది.
విశాఖ టీడీపీ పార్టీ కార్యాలయం వద్ద 'న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు'.. నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్‌కు పసికూన అఫ్గాన్ జట్టు షాకిచ్చింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ 69 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.