శ్రీశైలం ఆలయ శివాజీ గోపురంపై నాగుపాము సంచరిస్తుండడం కలకలం రేపింది. ఇవాళ్టి నుంచి దసరా మహోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో శివాజీ గోపురాన్ని ముస్తాబు చేస్తున్న లైటింగ్ సిబ్బంగికి నాగుపాము కనిపించింది.
తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబర్ 15 నుంచి 23 వరకు అంగరంగ వైభవంగా జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. అంకురార్పణ సందర్భంగా సేనాధిపతి అయిన శ్రీ విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సీబీఐకి అప్పగించాలని కోరడం తప్పా అంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు తాను వ్యతిరేకమని సోషల్ మీడియాలో తనపై ట్రోల్ చేస్తున్నారని ఆయన తెలిపారు.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ప్రభుత్వ వైద్యులు వెల్లడించారు. ఆయనకు చల్లటి వాతావరణం అవసరమని వారు పేర్కొన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యలో ప్రభుత్వ వైద్యులతో కలిసి జైళ్ల శాఖ డీఐజీ మీడియా సమావేశం నిర్వహించారు.
అమిత్ షా-లోకేష్ భేటీపై పురంధేశ్వరి స్పందించారు. లోకేష్‌ను అమిత్ షా పిలిచారా..? లేక లోకేష్ అడిగారా..? అనేది అప్రస్తుతమని.. వారిద్దరి మధ్య భేటీ జరిగిందన్నారు. చంద్రబాబుపై ఏయే కేసులు పెట్టారు..? ఏయే బెంచ్‌ల మీదకు కేసులు వెళ్లాయని అమిత్ షా అడిగారని ఆమె వెల్లడించారు
ప్రవళిక మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మీడియా సమావేశం ద్వారా కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. అశోక్ నగర్‌లో స్టూడెంట్ ప్రవళిక ఆత్మహత్యపై దర్యాప్తు చేశామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.