దేవి నవరాత్రులకు దుర్గ గుడికి ప్రాముఖ్యత ఉందని స్వామి స్వరూపానంద తెలిపారు. చుట్టూ ఉన్న పక్క రాష్టాల నుంచి తండోపతండాలుగా భక్తులు వస్తారని ఆయన పేర్కొన్నారు.
వచ్చే ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధిస్తుందని వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందన్నారు.
టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు రెండూ కలిసి పోటీ చేస్తాయని ఇరు పార్టీల అధినేతలు ఇప్పటికే ప్రకటించారు.
ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టోను బీఆర్‌ఎస్ వాళ్లు కాపీ కొట్టారని ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా పూర్తిగా అమలు చేయలేదని ఆయన విమర్శలు గుప్పించారు.
ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఇంగ్లాండ్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రహ్మానుల్లా అఫ్గాన్ ఆటగాళ్లు గుర్బాజ్, ఇక్రమ్ అలీఖిల్ రాణించడంతో ఆఫ్ఘనిస్థాన్ 50 ఓవర్లలో 284 పరుగులకు ఆలౌటైంది.
తిరుమలలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భక్తులను అలరించేలా 14 రాష్ట్రాల నుంచి కళా బృందాలు విచ్చేస్తున్నట్లు టీటీడీ జేఈవో సదా భార్గవి వెల్లడించారు.
ఇవాళ్టి నుంచి దసరా ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై ప్రారంభం అయ్యాయి. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్లను దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు.
ప్రపంచ విద్యార్థుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 15న జరుపుకుంటారు. ఇది మన మాజీ రాష్ట్రపతి, భారత మిస్సైల్ మ్యాన్ అయిన డా.ఎ.పి.జె. అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఘనంగా జరుపుకుంటారు.
రాజమండ్రిలోని సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉంటున్న బ్యారెక్‌లో ఎట్టకేలకు టవర్ ఏసీ ఏర్పాటు చేయడం మాత్రమే సరిపోదని బాడీ చెకప్ చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు డిమాండ్ చేశారు.
ప్రకాశం జిల్లా ప్రజలంతా మాగుంట కుటుంబానికి అండగా నిలబడాలని మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. నేటి రాజకీయాల్లో విలువలు లేకుండా పోతున్నాయని ఆయన అన్నారు.