AP SI Exam: ఏపీలో శని, ఆదివారాల్లో జరిగిన ఎస్సై మెయిన్స్ పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ విడుదలైంది. ఈ రెండు రోజుల్లో విశాఖ, గుంటూరు, ఏలూరు, కర్నూలు నగరాల్లో ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్షలు ప్రశాంతంగా ముగియగా.. ఆదివారం సాయంత్రం ప్రాథమిక కీ విడుదలైంది. ఈ పరీక్ష ప్రాథమిక కీని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు విడుదల చేసింది. అక్టోబర్ 18 సాయంత్రం 5 గంటల్లోగా సమాధానాలపై అభ్యంతరాలను slprbap.obj@gmail.comకు మెయిల్‌లో పంపాలని సూచించింది. అనంతరం తుది కీతో పాటు ఫలితాలు వెల్లడించనున్నారు. ప్రశ్నా పత్రాలను అధికారిక వెబ్‌సైట్‌లో https://slprb.ap.gov.in/ అందుబాటులో ఉంచారు.
Also Read: Indrakeeladri Temple: ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న స్వామి స్వరూపానంద
శని, ఆదివారాల్లో జరిగిన పరీక్షలకు 31,193 మంది అభ్యర్థులు అర్హత సాధించగా.. మొదటి రోజు పేపర్-1, పేపర్-2 పరీక్షలకు 30,585 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రెండో రోజైన ఆదివారం నాడు పేపర్-3, పేపర్-4 పరీక్షలకు 30,560 మంది హాజరయ్యారు. ఏపీలో సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో మొత్తం 6,511 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డ్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో 411 ఎస్సై పోస్టులు, 6,100 కానిస్టేబుల్ పోస్టులున్నాయి.