Gun Firing: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకీ కాల్పులు కలకలం రేపాయి. ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలే ఈ కాల్పులకు కారణమైనట్లు తెలిసింది. పని కోసం అడవిలోకి వెళ్లిన నరసింహను కాల్చేందుకు రామాంజనేయులు అనే వ్యక్తి నాటు తుపాకిని పేల్చారు. నరసింహ పక్కకు తప్పుకోవడంతో అతని వెంట వెళ్లిన పెద్దన్నకు బుల్లెట్ తగిలి గాయాలయ్యాయి.
Also Read: Chinta Mohan: చంద్రబాబు చాలా మంచివాడు.. తక్షణమే విడుదల చేయాలి..!
అహోబిలం చెంచు కాలనీకి చెందిన నరసింహ, రామాంజనేయులుకు చాలా కాలంగా మనస్పర్ధలు ఉన్నట్లు తెలిసింది. గాయపడిన పెద్దన్నను ఆసుపత్రికి స్థానికులు తరలించారు. కాల్పులు జరిపిన రామాంజనేయులు, గాయపడిన పెద్దన్న, నరసింహులు చెంచు కాలనీకి చెందిన వారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.