Ferrari: లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఫెరారీ అమెరికాలో తన కార్ల చెల్లింపుల కోసం క్రిప్టోకరెన్సీలో చెల్లింపును అనుమతించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. కంపెనీ సంపన్న కస్టమర్ల అభ్యర్థనల మేరకు ఈ పథకాన్ని యూరప్‌కు విస్తరిస్తుందని కంపెనీ మార్కెటింగ్, వాణిజ్య చీఫ్ ఎన్రికో గల్లీరా మీడియాతో చెప్పారు. ప్రస్తుత కాలంలో బిటికాయిన్ చెల్లింపులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కస్టమర్లలో ఎక్కువ మంది క్రిప్టోలో పెట్టుబడి పెట్టడంతో మార్కెట్, డీలర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ చీఫ్ తెలిపారు. ఫెరారీ ఈ ఏడాది ప్రథమార్థంలో అమెరికాలో 1,800 కంటే ఎక్కువ కార్లను రవాణా చేసింది. ఫెరారీ క్రిప్టో ద్వారా ఎన్ని కార్లను విక్రయించాలని భావిస్తున్నదో గల్లీరా చెప్పలేదు. క్రిప్టోకరెన్సీల ద్వారా చెల్లిస్తే ధరల్లో ఏమార్పు ఉండదని, ఎలాంటి ఫీజులు, సర్‌చార్జీలు ఉండవని గల్లీరా వెల్లడించారు.
Also Read: Most Expensive Pen : ఈ పెన్ను ఎన్ని కోట్లో తెలుసా.. ప్రత్యేకతలు ఏంటంటే?
ఇదిలా ఉండగా.. యూరప్‌కు క్రిప్టోకరెన్సీ చెల్లింపులను విస్తరించడం ద్వారా తన షిప్‌మెంట్‌లను మరింత పెంచుకోవాలని ఫెరారీ చూస్తోంది. యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్లు ఫెరారీకి అతిపెద్ద విక్రయ ప్రాంతాలుగా ఉన్నాయి. బిట్‌కాయిన్, ఇతర టోకెన్‌లఅస్థిరత వాటిని వాణిజ్యానికి అసాధ్యమైనందున బ్లూ-చిప్ కంపెనీలు చాలా వరకు క్రిప్టో నుంచి దూరంగా ఉన్నాయి. వీటిలో ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా కూడా ఉంది. టెస్లా 2021లో అతిపెద్ద క్రిప్టో కాయిన్ అయిన బిట్‌కాయిన్‌లో చెల్లింపును అంగీకరించడం ప్రారంభించింది. కానీ పర్యావరణ సమస్యల కారణంగా సీఈవో ఎలోన్ మస్క్ దానిని నిలిపివేసినట్లు తెలిసింది.