ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని రాయవరం వద్ద నిర్మిస్తున్న మెడికల్ కాలేజ్ పనులను శాసనసభ్యులు కేపీ నాగార్జున రెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి పరిశీలించారు.
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక గగన్‌యాన్ మిషన్ కీలక దశకు చేరుకోనుంది. గగన్‌యాన్ మిషన్ కింద అక్టోబర్ 21న టెస్ట్ ఫ్లైట్‌ను ప్రారంభించనున్నట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సోమవారం ప్రకటించింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారులు హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, బరువు 67 కేజీలు ఉన్నారని అధికారులు బులెటిన్‌లో తెలిపారు.
పీఎం కిసాన్ యోజనలో చాలా మంది మోసాలకు పాల్పడుతున్నందున ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది. చాలా మంది అనర్హులు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ-కేవైసీని తప్పనిసరి చేసింది.
సభలకు హాజరవుతున్న ప్రజలను చూస్తుంటే తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని స్పష్టమవుతోందని కేంద్ర మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు. మహేశ్వరంలో జరిగిన బీజేపీ ఎన్నికల సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిలు పాల్గొన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో నారా లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ సీఐడీ విచారణ ముగిసింది. స్కిల్ కేసులో రాజేష్‌ను సీఐడీ విచారించింది. ఉదయం పదిన్నర నుంచి సీఐడీ విచారణ కొనసాగింది.
ఎన్నికల వేళ బీఆర్‌ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. బీఆర్‌ఎస్ పార్టీకి మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ మహిళా అభివృద్ధి సంస్థ ఛైర్‌పర్సన్ ఆకుల లలిత రాజీనామా చేశారు.
చంద్రబాబు ఆరోగ్యంపై కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 25 సంవత్సరాల నుంచి చంద్రబాబుకి చర్మ వ్యాధులు ఉన్నాయని.. ఇది అందరికీ తెలుసన్నారు.
బీజేపీకి తెలంగాణ అండగా ఉందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ అవినీతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు అంగీకరించే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.