బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏకపక్ష మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై సునాయాస విజయాన్ని సాధించింది.
హిందువులు ఎంతో పవిత్రంగా భావించే ఆ జగన్మోహనుడిని అంటే..ఈ చరాచర సృష్టిని పాలించే విష్ణుమూర్తి అంశమే జగన్మోహనుడు అని..అటువంటి దైవాన్ని ఒక రాక్షసునిగా ఏ ఉద్దేశంతో టీడీపీ నేతలు చిత్రీకరించారో యావత్ భారతీయులకు వివరణ ఇవ్వాలని డిమాండు చేస్తూ వైసీపీ శ్రేణులు రాజమండ్రిలో నిరసన చేపట్టారు.
కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకాలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, కనీసం ఒక పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిని పెంపొందించడంతో సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను కోరారు.
మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణమని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆరోపించారు. మణిపూర్‌లో కుట్రపూరితంగానే ఈ ఘటన అంతా జరిగిందన్నారు. నాగ్‌పూర్‌లో విజయదశమి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ ఇటీవల మణిపూర్‌లో జరిగిన హింసాకాండను ప్రస్తావించారు.
తిరుమల పార్వేటి ఉత్సవాల్లో టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవీ ధర్మారెడ్డిలు పాల్గొన్నారు. బాగా పాతదై, కూలడానికి సిద్దంగా ఉన్న పరిస్థితిలో తిరుమల పార్వేటి మండపం స్థానంలో టీటీడీ ప్రాచీన రీతిలో అత్యద్భుతంగా నూతన మండపాన్ని టీటీడీ నిర్మించిందని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ కరువైంది. రోజు ఎక్కడో చోట అత్యాచార ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా మరోచోట దారుణం జరిగింది. ఒడిశాలో భర్తను దారుణంగా కొట్టి భార్యపై ఐదుగురు సామూహిక అత్యాచారం చేశారు.
దక్షిణాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికే ఈ వరల్డ్ కప్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన డికాక్.. తాజా మరో శతకాన్ని నమోదు చేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో క్వింటన్ డికాక్ 140 బంతుల్లో 174 పరుగులు చేశాడు.
ఇక నుంచి జంట నగరాల్లో కృష్ణా యూనియన్ పాల ఉత్పత్తులు లభ్యం కానున్నాయి. స్వచ్ఛమైన పాలు, పాల ఉత్పత్తులను విజయ బ్రాండ్ అందుబాటులోకి తీసుకొస్తోంది. ఆరు దశాబ్దాలుగా వినియోగదారులు విశ్వాసం చూరగొంటున్న కృష్ణ మిల్క్ యూనియన్ వారి విజయ పాలు, పెరుగు, పాల ఉత్పత్తులు ఇప్పుడు హైదరాబాద్ నగరంలో లభ్యం కానున్నాయి.
దేశ అంతరిక్ష యాత్రల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాలని ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ ఆకాంక్షించారు. ఈ కోరిక ప్రధాని మోడీ సహా దేశ ప్రజల మనోభావాలను ప్రతిబింబిస్తోందని అన్నారు.