మహారాష్ట్రలోని షిర్డీలో శ్రీ సాయిబాబా సమాధి ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ రమేష్ బాయిస్, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. ప్రధాన మంత్రి ఆలయం వద్ద కొత్త దర్శన క్యూ కాంప్లెక్స్‌ను ప్రారంభించారు.
జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మచ్చిల్ వద్ద నియంత్రణ రేఖ వెంబడి ఈరోజు భారత ఆర్మీ దళాలు చొరబాటు ప్రయత్నాన్ని విఫలం చేయడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొస్తున్నా.. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా చిన్నారులపై అత్యాచారాలు ఆగడం లేదు. నిత్యం దేశంలోని ఏదో మూల చిన్నారులపై అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. పసికందులను కూడా వదిలిపెట్టడం లేదు కామాంధులు.
సీఎం కేసీఆర్ మళ్లీ గెలిస్తే ఆసరా పెన్షన్ ఐదు వేలకు పెంచుతామని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డిలోని నాల్సబ్ గడ్డలో బీఆర్‌ఎస్‌లో చేరికల కార్యక్రమంలో మంత్రి హరీశ్ రావు పలువురిని పార్టీలోకి ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీని విమర్శించేస్థాయి కేటీఆర్, హరీష్, కవితలకు లేదని కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి జిల్లా భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్యఅతిథిగా జానారెడ్డి హాజరయ్యారు.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఇచ్చే హామీలు అమలైనట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటానని ఆయన సవాల్ విసిరారు.
మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజి వద్ద కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుస్నాబాద్‌ను కోనసీమ చేస్తానన్న కేసీఆర్ ఇప్పుడు ఎం చెప్తారని ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన వివరాలు ట్విట్టర్‌లో పెట్టాలన్నారు.
నెదర్లాండ్స్ 9 పరుగులకే ఆఖరి 5 వికెట్లు కోల్పోవడంతో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని అందుకుంది. నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 310 పరుగుల భారీ తేడాతో కొత్త ప్రపంచకప్ రికార్డును నెలకొల్పింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా కుత్బుల్లాపూర్‌లో నిర్వహించిన లైవ్ డిబేట్‌లో మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారి తీసింది.