పాలస్తీనా-ఇజ్రాయెల్ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయకుండా ఆపాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ మంగళవారం విజ్ఞప్తి చేశారు. ప్రపంచం యుద్ధం, శాంతిని ఎంచుకోవలసి ఉంటుందని ఆయన అన్నారు.
శ్రీలంక వెళ్లాలనుకుంటున్నారా.. ఇక నుంచి ఆ దేశానికి వీసా లేకుండానే వెళ్లొచ్చు. ఈ మేరకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ద్వీప దేశం పర్యాటక రంగాన్ని పునర్నిర్మించే ప్రయత్నాల మధ్.. భారతదేశం, ఇతర ఆరు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఉచిత టూరిస్ట్ వీసాలు జారీ చేసే విధానాన్ని శ్రీలంక మంత్రివర్గం ఆమోదించిందని విదేశాంగ మంత్రి అలీ సబ్రీ ఈరోజు తెలిపారు.
నిర్మాణ రంగంలో కొత్తదనం సృష్టించాలనే ఆశయంతో 2015 సంవత్సరంలో ప్రారంభించిన శ్రీ భ్రమర టౌన్షిప్స్ ప్రైవేట్ లిమిటెడ్, 30 పైగా ప్రాజెక్టులతో, 8 వేల మందికి పైగా సొంతింటి కల నెరవేర్చి, కృష్ణ, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో వేలాది కుటుంబాలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు అందించి, స్థిరాస్తి రంగంలో తమదైన ముద్ర వేసుకుని 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ ఏట అడుగుపెడుతోంది.
శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అర్చకుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆలయంలో రామ్‌లల్లా ప్రతిష్ఠాపనకు ముందు, ట్రస్ట్ ఆసక్తిగల వ్యక్తుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తుకు చివరి తేదీ 31 అక్టోబర్ 2023.
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై అనేక పుకార్లు, వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవలే ఆయనకు గుండెపోటు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా గుండెపోటుతో పుతిన్ మంచంపై నుంచి పడిపోయినట్లు వచ్చిన వార్తలు కలకలం రేపుతున్నాయి.
మద్యం మత్తులో ఉన్నప్పుడు కొందరికి అసలు స్పృహ ఉండదు. మత్తులో ఏం చేస్తున్నారో వారికి అవగాహన ఉండదు. మద్యం సేవించి ఆ మత్తులో వారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు.
నవరాత్రి పండుగ సందర్భంగా బాలికలు కచ్‌లోని హస్తకళలతో తయారు చేసిన చనియా-చోళీని ధరించి గర్బాను జరుపుకుంటున్నారు. అదే కళ, సంస్కృతి కారణంగా, కచ్‌లోని ధోర్డో గ్రామం ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా ఐక్యరాజ్యసమితి నుంచి బిరుదును పొందింది.
కొచ్చి విడాకుల కేసులో కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కేరళ హైకోర్టు గురువారం మౌఖికంగా విమర్శిస్తూ.. మహిళలు తమ తల్లి, అత్తగారికి బానిసలు కాదని పేర్కొంది. మహిళ నిర్ణయాలు ఏ విధంగానూ తక్కువ కాదని జస్టిస్ దేవన్ రామచంద్రన్ అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తనపై విధించిన ఐదేళ్ల నిషేధాన్ని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) ట్రిబ్యునల్ ధృవీకరించడాన్ని వ్యతిరేకిస్తూ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అవినీతిపై కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తూ కర్ణాటక బీజేపీ శుక్రవారం 'ఏటీఎం గవర్నమెంట్ కలెక్షన్ ట్రీ' పోస్టర్‌ను విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కోసం డబ్బు సేకరించేందుకు కర్ణాటకను ప్రభుత్వం ఏటీఎంగా వాడుకుంటోందని బీజేపీ ఆరోపించింది.