Pakistan Cricket: ‘‘నోరు మూసుకుని ఆడు’’.. పాక్ ప్లేయర్‌పై మాజీల ఆగ్రహం..
- భారత్ చేతిలో ఓటమితో పాక్ టీమ్‌లో అంతర్గత విభేదాలు..
- షాదాబ్ ఖాన్ టార్గెట్‌గా మాజీల విమర్శలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan Cricket: టీమిండియా చేతిలో ఘోర పరాజయం పాకిస్తాన్ క్రికెట్‌లో అంతర్గత విభేదాలకు కారణమవుతోంది. మాజీలు, ప్రస్తుత పాకిస్తాన్ టీం ప్లేయర్లపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా సీనియర్లుగా భావిస్తున్న బాబర్ అజం, షాహీన్ అఫ్రిది, షాదాబ్ ఖాన్‌లను ఏకిపారేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌లో ఇండియా చేతిలో ఘోరంగా ఓడిపోవడానికి ఆ దేశ అభిమానులు, మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇదిలా ఉంటే, మాజీలను ఉద్దేశించి ఆల్-రౌండర్ షాదాబ్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత పెంచాయి. మాజీల విమర్శలపై షాదాబ్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘కనీసం మేమైనా ఐసీసీ ఈవెంట్లలో భారత్‌ను ఓడించిన పాక్ జట్టులో భాగంగా ఉన్నాం, గత తరం (90వ దశకం వారు) ఆ పని కూడా చేయలేకపోయారు’’ అని ఎద్దేవా చేశారు.
Also Read
- MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
- Shreyas Iyer: "ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం".. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
- IND Vs WI: ఏమి ఆట భయ్యా..! ఒకరిని మించి ఒకరు.. కొట్టుడే కొట్టుడు.. భారత్ భారీ స్కోర్..
- IND Vs WI: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న వెస్టిండీస్.. తుది జట్లు ఇదే..
Read Also: White vs Brown Rice: వైట్ రైస్ – బ్రౌన్ రైస్.. బరువు తగ్గడానికి, ఆరోగ్యానికి ఏది ముఖ్యం..
షాదాబ్ ఖాన్ వ్యాఖ్యలపై అహ్మద్ షెహజాద్ మాట్లాడుతూ.. ‘‘షాదాబ్ నువ్వు దొడ్డిదారిన టీమ్‌లోకి వచ్చాము. దేశవాళీలో నీ ఆటతీరు సరిగా లేదు. కేవలం పక్షపాత వల్ల మాత్రమే నువ్వు జట్టులో కొనసాగుతున్నావు’’ అని ఆరోపించారు. గతంలో పాకిస్తాన్ జట్టు వరల్డ్ కప్‌లో భారత్ చేతిలో ఓడిపోయినా, మిగిలిన సమయాల్లో భారత్‌పై పూర్తి ఆధిపత్యం చలాయించేదని, వారి స్థాయికి షాదాబ్ సరితూడడని షెహజాద్ మండిపడ్డారు.
జట్టులో ఉన్నప్పుడు విమర్శలు సహజం, ఆటతీరు సరిగా లేనప్పుడు ఆటతో సమాధానం చెప్పాలి, కాని ఇలా మాట్లాడకూడదు, ఆట తీరు సరిగా లేనప్పుడు నోరు మూసుకుంటే మంచిదని మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ అన్నారు. ఇక షాహిద్ అఫ్రిది మరో అడుగుముందుకేసి.. నమీబియాపై ఆడి, గెలిచి ఒంట ఓవరాక్షన్ అవసరం లేదు, న్యూజిలాండ్‌పై గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!