PM Modi: భారత్ ఆయుధాలు వాడేది ఆత్మరక్షణకే.. ఆధిపత్యం చెలాయించడం కోసం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: కులతత్వం, ప్రాంతీయత వంటి సామాజిక వక్రీకరణలను రూపుమాపాలని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రజలకు పిలుపునిచ్చారు. ఢిల్లీలోని ద్వారకాలోని రామ్‌లీలా మైదాన్‌లో జరిగిన దసరా కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ, కనీసం ఒక పేద కుటుంబం సామాజిక-ఆర్థిక స్థితిని పెంపొందించడంతో సహా 10 ప్రతిజ్ఞలు తీసుకోవాలని ప్రజలను కోరారు. ఈరోజు రావణ దహనం కేవలం దిష్టిబొమ్మ దహనం మాత్రమే కాకుండా కులతత్వం, ప్రాంతీయత పేరుతో ‘మా భారతి’ని విభజించడానికి ప్రయత్నించే శక్తుల గురించి కూడా ఉండాలని ప్రధాని మోడీ అన్నారు. “విజయదశమి పండుగ జాతికి చెందిన ప్రతి దుర్మార్గంపై దేశభక్తి విజయోత్సవ పండుగగా కూడా ఉండాలి. సమాజంలోని చెడులు, వివక్షలను అంతం చేస్తామని ప్రతిజ్ఞ చేయాలి. అభివృద్ధి పథంలో కొత్త శక్తి, కొత్త తీర్మానాలతో ముందుకు వెళ్తాము. అందరం కలిసి ‘శ్రేష్ఠ భారత్’ని రూపొందిస్తాం’ అని అన్నారు. “విజయదశమి నాడు శస్త్రపూజ చేసే సంప్రదాయం కూడా ఉంది. భారత గడ్డపై ఆయుధాలు పూజించబడడం ఏ భూమిపైనా ఆధిపత్యం కోసం కాదు, సొంత భూమిని కాపాడుకోవడం కోసం. మన శక్తి పూజ మన కోసమే కాదు, సర్వజన క్షేమం కోసం. ప్రపంచం కోసం అని…” ప్రధాని మోడీ పేర్కొన్నారు.
Also Read: Mohan Bhagwat: మణిపూర్‌లో జరుగుతున్న హింసకు బాహ్య శక్తులే కారణం
Also Read
- SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
- Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Hormuz Strait: హోర్ముజ్‌లో నౌకపై దాడి.. 11 మంది భారతీయ నావికులకు గాయాలు
రామ మందిరంపై ప్రధాని మోదీ మాట్లాడుతూ, “చాలా కాలం నిరీక్షణ తర్వాత అయోధ్యలో రామజన్మభూమిపై శ్రీరాముని ఆలయాన్ని నిర్మించడం ఈ రోజు మనం అదృష్టవంతులమని, ఇది మన సహనానికి సంకేతం” అని ఆయన అన్నారు.తన ప్రసంగంలో, ప్రధాని మోదీ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో), చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ చేయడానికి దాని విజయవంతమైన ప్రయత్నాన్ని కూడా ప్రశంసించారు. భారత్ త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆయన అన్నారు.చంద్రుడిని చేరుకున్నాము. ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాము. కొద్ది వారాల క్రితమే కొత్త పార్లమెంటు భవనంలోకి ప్రవేశించాము. మహిళా శక్తికి ప్రాతినిధ్యం కల్పించేందుకు, పార్లమెంటు నారీ శక్తి వందన్ అధినియంను ఆమోదించింది,” అని ప్రధాన మంత్రి తెలిపారు.
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!