SA vs BAN: బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో ఓడించి దక్షిణాఫ్రికా మరో భారీ విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. ఈ ఏకపక్ష మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా మరోసారి తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌పై సునాయాస విజయాన్ని సాధించింది.టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 382 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. కేవలం 140 బంతుల్లోనే 174 పరుగులతో అద్భుతంగా రాణించి క్వింటన్ డి కాక్ ఇన్నింగ్స్ హీరోగా నిలిచాడు. క్వింటన్ డికాక్ హెన్రిచ్ క్లాసెన్‌తో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. క్లాసెన్ మెరుపులు మెరిపిస్తూ 49 బంతుల్లోనే 90 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే కెప్టెన్ మార్‌క్రమ్ కూడా స్వయంగా 60 పరుగులు జోడించాడు. చివరి 13 ఓవర్లలో దక్షిణాఫ్రికా 174 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో హసన్ మహమూద్ 2, షోరిఫుల్, హసన్ మిరాజ్, షకీబ్ అల్ హసన్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Quinton De Kock: తన 150వ వన్డే మ్యాచ్‌లో రికార్డులు సృష్టించిన డికాక్
383 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభం నుంచే సవాలు ఎదురైంది. దక్షిణాఫ్రికా బౌలింగ్ దాడి వేగంగా టాప్ ఆర్డర్‌ను కూల్చివేసింది. బంగ్లాదేశ్ ప్రారంభ ఆరు ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పవర్‌ప్లే ముగిసే సమయానికి, బంగ్లాదేశ్ 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. అప్పటికే నాలుగు వికెట్లు కోల్పోయింది. మహ్మదుల్లా నుంచి సాహసోపేతమైన ప్రయత్నం ఉన్నప్పటికీ, మరే ఇతర బ్యాటర్ గణనీయమైన ప్రతిఘటనను అందించలేకపోయారు. మహ్మదుల్లా తన జట్టు కోసం అద్భుతమైన సెంచరీని సాధించాడు, మరొక బ్యాటర్ ఆరంభాలను మార్చలేకపోయారు.చివరికి బంగ్లాదేశ్ 46.4 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అంతగా రాణించలేకపోయాడు. . దక్షిణాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ 3, మార్కో జాన్సన్, కగిసో రబాడ, లిజాడ్ విలియమ్స్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహరాజ్ ఒక్కో వికెట్ తీశాడు. 140 బంతుల్లో 174 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.