అంతరిక్ష రంగ అభివృద్ధికి ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను రూపొందించిందని, స్వదేశీయంగా నిర్మించిన అంతరిక్ష నౌకలో భారతీయుడు చంద్రునిపైకి వెళ్లే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అన్నారు.
దేశంలో మురుగు కాల్వల మరణాల ఘటనలను తీవ్రంగా పరిగణించిన సుప్రీంకోర్టు.. మురుగు కాల్వలను శుభ్రం చేసే సమయంలో మరణించిన వారి కుటుంబానికి ప్రభుత్వ అధికారులు రూ.30 లక్షల పరిహారం చెల్లించాలని పేర్కొంది.
మాజీ ప్రధాని దేవెగౌడ చేసిన ప్రకటనపై కేరళలో రాజకీయ వివాదం నెలకొంది. కర్ణాటకలో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు కేరళలో అధికార ఎల్‌డీఎఫ్ మిత్రపక్షమైన జేడీఎస్‌కు ఆమోదం తెలిపినట్లు జేడీఎస్ అధినేత హెచ్‌డీ దేవెగౌడ చేసిన వాదనను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ శుక్రవారం (అక్టోబర్ 20) తోసిపుచ్చారు.
బెంగళూరు మెట్రో పర్పుల్ లైన్‌లోని బైయప్పనహళ్లి నుంచి కృష్ణరాజపుర వరకు, కెంగేరి నుంచి చల్లఘట్ట కాళ్ల వరకు మెట్రో రైలు సేవలు కనెక్టివిటీని మెరుగుపరుస్తాయని, లక్షలాది మంది ప్రయాణికులకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్ని విపక్ష పార్టీ ఒక్కతాటిపై నిలిచి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పడిన సంగతి తెలిసిందే. కానీ ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కర్ణాటకలోని చిత్రదుర్గలో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఉదంతం వెలుగుచూసింది. 20 ఏళ్ల యువకుడు తన తాతను కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వాలని అడిగాడు. ఈ క్రమంలో ఆయన మొబైల్ ఫోన్ కొనడానికి నిరాకరించాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు.
నిఠారీ వరుస హత్యల నిందితుడు మోనీందర్ సింగ్ పంధర్‌ను అలహాబాద్ హైకోర్టు అన్ని అభియోగాల నుంచి తొలగించిన కొద్ది రోజుల తర్వాత గ్రేటర్ నోయిడా జైలు నుంచి ఈరోజు విడుదలయ్యాడు.
కట్టుకున్న భార్య, కన్న కొడుకు ఇద్దరూ కలిసి ఆ ఇంటి పెద్దను దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలో మాండ్యా జిల్లాలోని ఓ గ్రామంలో ఓ మహిళ తన కొడుకుతో కలిసి భర్తను హత్య చేసింది.