మేడిగడ్డ ఆనకట్ట డిజైన్‌లో ఎలాంటి లోపాలు లేవని తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ పేర్కొన్నారు. డిజైన్ లోపం ఉంటే మూడు సీజన్లు ఎలా తట్టుకుంటుందని ఆయన ప్రశ్నించారు. ఏడో బ్లాక్లో సమస్య వల్ల సెంటర్ పిల్లర్ కుంగిందని అన్నారు. కానీ ఫౌండేషన్ కింద ఇసుక కదలిక వల్ల సమస్య వచ్చిందని అనుకుంటున్నామని అనుమానం వ్యక్తం చేశారు.
సంగారెడ్డి గడ్డపై ఈ సారి గులాబీ జెండా ఎగరేస్తామని మంత్రి హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆయన వ్యాఖ్యానించారు. జగ్గారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ఎన్ని గ్రామాల్లో తిరిగారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణలో ఆర్భాటంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగి పోవడం తీవ్రమయిన అంశమని ఆయన అన్నారు. క్వాలిటీ విషయంలో అనుమానాలు మొదలయ్యాయని ఆయన వెల్లడించారు.
2023 ప్రపంచకప్‌లో ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియా నెదర్లాండ్స్ మ్యాచ్‌లో ఆసీస్ విధ్వంసం సృష్టించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా జట్టు.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 399 పరుగులు చేసింది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పార్టీ మార్పుపై స్పందించారు. ఇప్పటికే లేఖ విడుదల చేశానన్న రాజగోపాల్ రెడ్డి.. 2009 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పని చేశానన్నారు. కాంగ్రెస్‌లో నాయకత్వ ఎంపికలో జరిగిన తప్పుడు నిర్ణయాల వల్లా కాంగ్రెస్ రెండు సార్లు ఓడిపోయిందన్నారు.
బీజేపీ- బీఆర్ఎస్ల లగ్గం పిలుపు పేరుతో కాంగ్రెస్ పార్టీ పెండ్లి కార్డు విడుదల చేసింది. తెలంగాణ అమరవీరుల ఆత్మఘోశ అంటూ కార్డులో కాంగ్రెస్ పేర్కొంది. కేసీఆర్ ఫాంహౌజ్‌లో బీజేపీ- బీఆర్ఎస్ పార్టీల పెండ్లి అంటూ వివాహ పత్రిక విడుదల చేసింది.
హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ప్రతీ ఏడాది దసరా మహోత్సవం అనంతరం బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఆయన కుమార్తె విజయలక్ష్మి ఘనంగా నిర్వహించారు.
నర్సాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ప్రస్తుత నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కలిసి ఆమెకు బీఫామ్ అందజేశారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం దురదృష్టకరమని బీజేపీ నేత మర్రి శశిధర్ రెడ్డి పేర్కొన్నారు. ఆయనకు బీజేపీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చిందని ఆయన వెల్లడించారు.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనతో పొత్తుపై బుధవారం స్పష్టత రానున్నట్లు బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు.