ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన మందకృష్ణ పలు అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుతో పాటు వివిధ అంశాలపై సీఎంతో చర్చించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు, ఏపీలో పోలీస్ వ్యవస్థ తీరును అద్దం పట్టేలా ఉన్నాయన్నారు. పోలీసు వ్యవస్థ , హోం శాఖపై డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు చేశారని.. ఈరోజు స్వయంగా డిప్యూటీ సీఎం హోంశాఖ విఫలమైందని చెప్పారన్నారు. బయటికి వెళ్తే మమ్మల్ని ప్రజలు తిడుతున్నారని, డీజీపీకి డిప్యూటీ సీఎం చెప్పుకుంటున్నారన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నిర్మాణ పనులు చేస్తు్న్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.
నంద్యాల జిల్లా మహానంది మండలం గాజులపల్లెలోని గుడిసెలో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలింది. మంటలు వ్యాపించకముందే కుటుంబసభ్యులు ప్రాణభయంతో పరుగులు తీశారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో గ్రామస్థులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు
విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన గురువు నీచంగా ప్రవర్తించాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలో సాంఘిక సంక్షేమ శాఖ వసతిగృహ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన లెక్కల టీచర్ విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు.
ఏపీలో మహిళలపై వరుస అఘాయిత్యాలు జరుగుతున్నాయని.. 120 రోజుల్లో 110 ఘటనలు జరిగాయని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. స్కూల్ నుంచి వస్తున్న అమ్మాయికి మత్తు మందు ఇచ్చి అత్యాచారం చేశారని ఆమె తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎక్కడికి పోయారంటూ ప్రశ్నించారు. రేప్ జరిగింది అన్న విషయాన్ని కప్పిపెట్టడానికి అనేక హాస్పిటల్స్‌కి తిప్పారని ఆరోపించారు.
తెలంగాణలోని జూనియర్ జాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు రేపటి(నవంబర్ 6) నుంచి నవంబర్ 26వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు ఇంటర్మీడియట్ బోర్డు అవకాశాన్ని కల్పించింది. రూ.100 ఆలస్య రుసుముతో డిసెంబర్ 4 వరకు అవకాశాన్ని కల్పించారు
పల్నాడు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. జిల్లాలోని మాచవరం మండలం వేమవరం, చెన్నాయపాలెంలోని సరస్వతి పవర్ భూములను పవన్ కల్యాణ్ పరిశీలించారు. సరస్వతి సిమెంట్స్ కోసం భూములను రైతులకు ఇష్టం లేకుండా గత ప్రభుత్వాలు తీసుకున్నాయని మండిపడ్డారు. కేవలం ఫర్నిచర్ వాడుకున్నారని నెపంతో స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తిని వేదనకు గురి చేశారని విమర్శించారు.