AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ సమావేశం.. పలు కీలక అంశాలపై చర్చ
- రేపు ఏపీ కేబినెట్ సమావేశం
- రేపు ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ
- పలు కీలక అంశాలపై చర్చించనున్న ఏపీ కేబినెట్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Cabinet: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. పలు కీలక అంశాలపై ఏపీ కేబినెట్ చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్టు 1982 రిపీల్ బిల్లు ప్రతిపాదనపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది. ల్యాండ్ గ్రాబింగ్ చట్టంలోని కొన్ని నిబంధనల కారణంగా భూ ఆక్రమణల్లో కేసుల నమోదుకు ఇబ్బందులు వస్తున్నట్టు ఇప్పటికే గుర్తించారు. వైసీపీ హయాంలో లక్షల ఎకరాలు అన్యాక్రాంతం అయినట్టు కూటమి ప్రభుత్వం గుర్తించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వానికి అందుతున్న ఫిర్యాదుల్లో 80 శాతం భూ ఆక్రమణల పైనే ఉన్నట్టు గుర్తించారు. ప్రస్తుత చట్టంతో అక్రమార్కులపై చర్యలకు ఇబ్బందులు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీని స్థానంలో కొత్త చట్టం తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ల్యాండ్ గ్రాబింగ్ చట్టం 1982 ను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ల్యాండ్ గ్రాబింగ్ ప్రోహిబిషన్ బిల్లు 2024ను తీసుకువచ్చేందుకు ప్రతిపాదనలు ఉన్నాయి. దీనిపై మంత్రివర్గంలో చర్చించి ఆమోదాన్ని తెలియజేసే అవకాశం ఉంది.
Read Also: Ambati Rambabu: హోంమంత్రి కాకపోతే సీఎం అవ్వు.. పవన్‌పై మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
- Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
- Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
- Nirmala Sitharaman: "వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు".. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నట్లు తెలిసింది. వైసీపీ హయాంలోని నామినేటెడ్ పదవుల కేటాయింపు చట్టం 2019ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకోనున్నారు. దీనికి అనుబంధంగా ఇచ్చిన జీవో 77 ను కూడా మంత్రివర్గం రద్దు చేయనుంది. 2017లో చేసిన స్మార్ట్ పల్స్ సర్వే నివేదికను నామినేటెడ్ పోస్టుల నియామకానికి ప్రాతిపదికగా తీసుకోవాలని నిర్ణయించింది. కొత్త క్రీడా విధానం, డ్రోన్ , సెమికండక్టర్ , డాటా సెంటర్ పాలసీలపై చర్చించి కేబినెట్ ఆమోదం తెలపనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతానికి పెంపుదల ప్రతిపాదనపై చర్చించనున్నారు. ఒలంపిక్స్ క్రీడల్లో బంగారు పతకం సాధించిన క్రీడాకారులకు ప్రోత్సాహకం రూ.7 కోట్ల కు పెంపుపైనా కేబినెట్ చర్చించనుంది. పరిశ్రమల రంగానికి సంబంధించి ఆర్సెలార్ మిట్టల్ గ్రూప్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూ కేటాయింపులపైనా చర్చించే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Bihar: బీహార్ లైంగిక వేధింపుల ఘటనలో నిందితుడి ఎన్కౌంటర్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Central Government Jobs: జేన్ జీకి ఈ మూడు ప్రభుత్వ ఉద్యోగాలంటే ఎందుకంత పిచ్చి? ఆసక్తికర విషయాలు..
-
Smriti Mandhana History: స్మృతి మంధాన వరల్డ్ రికార్డు.. మహిళల క్రికెట్లో ఇదే తొలిసారి!
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Nirmala Sitharaman: “వినియోగదారులకు రూపాయి ఖర్చు లేదు”.. యూపీఐ ఛార్జీలపై ఆర్థిక మంత్రి క్లారిటీ..
ట్రెండింగ్
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!
-
42 గంటల బ్యాటరీ, అల్ట్రా-లైట్ డిజైన్, AI ఫీచర్లతో VIVO Buds Clip ఓపెన్-ఇయర్ ఇయర్‌ఫోన్స్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!
-
50MP Zeiss కెమెరా, 1.5K 144Hz డిస్‌ప్లే, 6,510mAh బ్యాటరీతో ఫ్లాగ్షిప్ మొబైల్ VIVO X500 Pro లాంచ్.!