CM Chandrababu: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో ఈ నెల 9న ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. శ్రీశైలం పాతాళగంగలోని కృష్ణానది , బెజవాడ ప్రకాశం బ్యారేజీ ల్యాండింగ్ పాయింట్లుగా సీ ప్లేన్ సర్వీసును లాంఛనంగా ప్రారంభించనున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు ఆ పరిధిలో ఉన్న స్థలాలకు మహర్దశ పట్టనుంది. సీ ప్లేన్ సర్వీస్ కోసం కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కృషి చేసిన సంగతి తెలిసిందే.
Read Also: RK Roja: మీ వల్ల కాకపోతే రాజీనామా చేయండి.. మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు
సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన ఏర్పాట్లను ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కలెక్టర్ రాజకుమారి, ఎస్పీ అధిరాజ్ సింగ్‌లు పరిశీలించారు. పాతాళగంగ వద్ద సీప్లేన్ ల్యాండ్ కానున్న ప్రదేశం, రోప్ వే, ఆలయాన్ని వారు పరిశీలించారు. ఈనెల 9న విజయవాడ నుంచి శ్రీశైలం వరకు సీప్లేన్‌ను సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీప్లేన్‌లో ప్రయాణించి శ్రీశైలం జలాశయం చేరుకొని రోప్ వే ద్వారా సీఎం చంద్రబాబు మల్లన్న ఆలయానికి చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా.. శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తరహాలో ఆధ్యాత్మికంగానూ, అటు పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేపట్టారు.