CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి జల వనరుల శాఖ మంత్రి రామానాయుడు, ఇరిగేషన్ శాఖ అధికారులు, నిర్మాణ పనులు చేస్తు్న్న వివిధ ఏజెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో తలెత్తిన సమస్యలను పరిష్కరించి మళ్లీ పూర్తి స్థాయిలో పోలవరం పనులు ముందుకు తీసుకువెళ్లే అంశంపై చర్చించారు. కొత్త డయాఫ్రం వాల్ డిజైన్లు, నిర్మాణ ప్రణాళికపై చర్చలు జరిపారు.
Read Also: CM Chandrababu: ఈనెల 9న సీఎం చంద్రబాబు శ్రీశైలం పర్యటన.. సీ ప్లేన్ సర్వీస్ లాంచ్
డిజైన్లకు అనుమతులు, నిర్దేశిత లక్ష్యాల మేరకు పనులు పూర్తయ్యే అంశంపై ఈ కీలక సమావేశంలో చర్చించారు. ఇదిలా ఉండగా.. రేపు పోలవరానికి నిపుణుల బృందం వెళ్లనున్నట్లు సమాచారం. పోలవరం డయాఫ్రం వాల్, ఈసీఆర్ఎఫ్ నిర్మాణంకు సంబందించి రేపు వర్క్ షాప్ నిర్వహించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 9 వరకూ పోలవరంలో పరిశీలనలు జరపనున్నట్లు తెలిసింది. ప్యానల్ ఎక్స్‌పర్ట్‌లు, సీడబ్ల్యూసీ, పోలవరం ప్రాజెక్ట్ అధారిటీలతో పాటు ఆఫ్రీ, ఫుగ్రో, కెల్లర్ లాంటి విదేశీ కంపెనీలు, విదేశీ నిపుణులు పోలవరంను సందర్శించనున్నారు.