ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత సమావేశమయ్యారు. హోంమంత్రిపై పవన్ వ్యాఖ్యలు, ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఈ సమావేశం ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు - పోలీసుల రియాక్షన్‌పై పవన్ ఇటీవల అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మావోయిస్టు పార్టీ లేఖలు...ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఎందుకు వస్తున్నాయి ? వరుస లేఖలు నిజంగానే మావోయిస్టులు విడుదల చేస్తున్నారా ? లేదంటే వాటి వెనుక ఎవరైనా ఉన్నారా ? నేతలను, పోలీసులను...కలవరానికి గురిచేస్తున్న ఆ లేఖల సారాంశం ఏంటి ? ఇంతకీ ఆ నియోజకవర్గం ఏంటి...? వరుస లేఖలతో రాజకీయ నేతల్లో వణుకు మొదలైందా ?
అమెరికా అధ్యక్షునిగా డోనాల్డ్ ట్రంప్ రెండో పర్యాయం ఎన్నికైన సందర్భాన్ని పురస్కరించుకొని విశాఖకు చెందిన చిత్రకారుడు మోకా విజయ్ కుమార్ మిల్లెట్స్ ఉపయోగించి ట్రంప్ చిత్రపటాన్ని తయారు చేశారు. అమెరికా అధ్యక్షునిగా రెండో పర్యాయం ఎన్నికైన సందర్భంగా చిరుధాన్యాలను ఉపయోగించి ఎంతో సహజసిద్ధంగా ఈ చిత్రాన్ని తయారు చేశారు.
తెలంగాణలో కులగణన సర్వేతో అంతా తెలిపోతుందా ? కులగణన తేలిపోయాక...స్థానిక సంస్థల ఎన్నికల వరకే అమలు చేస్తారా ? రాజకీయంగా ఆయా వర్గాలకు అవకాశాలు అంది వస్తాయా ? జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లోనూ సీట్లు కేటాయిస్తారా ? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్‌గా మారింది.
కడప జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్థానంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ వాసన విద్యాసాగర్ నాయుడును ఇన్చార్జిగా నియమించారు. బదిలీ అయిన హర్షవర్ధన్ రాజును డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలలో పేర్కొన్నారు.
సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారన్న ఆరోపణలతో, పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్‌లను మాజీ మంత్రి అంబటి రాంబాబు పరామర్శించారు. డీజీపీ రాజకీయ నేత లాగా వ్యవహరించకూడదని ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు, మా కార్యకర్తల మీద కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి అమిత్ షాతో సమావేశమయ్యారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హస్తిన పర్యటనలో ఉన్నారు. తొలిసారి ఏపీ ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఏపీలో పరిస్థితులు, రాజకీయ అంశాలపై అమిత్ షాతో పవన్ కల్యాణ్ చర్చించే అవకాశం ఉంది.
విజయనగరం స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ రఘురాజుపై వైసీపీ వేసిన అనర్హత పిటిషన్‌పై మండలి ఛైర్మన్ తీసుకున్న అనర్హత వేటును రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది.