ఎన్నికలపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలో పలు నియోజకవర్గాలకు పార్టీ ఇంఛార్జిలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 175 నియోజకవర్గాల్లో చేసిన సర్వే ప్రకారం.. 45 నుంచి 50 నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చే అవకాశం ఉంది. ఫస్ట్ ఫేజ్ లో 11 సెగ్మెంట్లలో పరిస్థితిని వైసీపీ విశ్లేషించింది. సీనియర్ నేత, మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద మీడియాకు…
ప్రధాని నరేంద్రమోడీతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీం కోర్టు తీర్పు చారిత్రాత్మకమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. జమ్ము - కశ్మీర్‌ను భారతదేశంలో సంపూర్ణంగా విలీనం చేయాలని కలలుగన్న భారత్ ప్రజలందరికీ.. సుప్రీం తీర్పు మరో విజయమని ఆయన వ్యాఖ్యానించారు.
ఏపీలో అధికార పార్టీలో వరుస రాజీనామాలు జరుగుతున్నాయి. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా చేసిన కొద్ది సేపట్లోనే గాజువాక వైసీపీ ఇంఛార్జ్ తిప్పల దేవన్‌రెడ్డి కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖకు క్యాంపు కార్యాలయాల తరలింపు పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రోస్టర్ ప్రకారం తన బెంచ్‌కు పిటిషన్ వచ్చిందని, తాను విచారించి ఆదేశాలు ఇవ్వొచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.
మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఏపీ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన తన ఎమ్మెల్యే పదవికి, వైఎస్సార్‌సీపీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన స్పష్టత ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ఉదయం నుంచి వేగంగా మంగళగిరి నియోజకవర్గ రాజకీయాలు మారుతున్నాయి. మంగళగిరి పంచాయతీ తాడేపల్లికి చేరింది.
తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పోసాని కృష్ణ మురళి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కలలు కంటోందని.. తెలంగాణలో కేసీఆర్ గెలిస్తే ఇక్కడ జగన్ గెలుస్తాడు అని చెప్పరు ఓడితే మాత్రం అది జరుగుతుంది అంటున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి, జగన్ ప్రభుత్వానికి సంబంధం ఏంటని పోసాని ప్రశ్నించారు.
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రాజీనామా చేశారన్నా వార్త తనకు ఇప్పుడే తెలిసిందని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. ఓఎస్డీ ద్వారా సమాచారం అందిందన్నారు. ఆర్కే ఎందుకు రాజీనామా చేశారన్న స్పష్టత గురుంచి తనకు తెలియదన్నారు.