Vijayasai Reddy Met PM Modi: ప్రధాని మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayasai Reddy Met PM Modi: ప్రధాని నరేంద్రమోడీతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానమంత్రిని కలుసుకోవడం గౌరవంగా విశేషంగా భావిస్తున్నానని ఈమేరకు భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫలవంతమైన సహకారం ఆశిస్తున్నామని అన్నారు. కేంద్రం- రాష్ట్రంలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల మధ్య.. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు.
Today, I met the Hon’ble Prime Minister Shri @narendramodi Ji in his office in Parliament and highlighted several issues concerning Andhra Pradesh. As always, it was an honour and privilege to meet the Hon’ble PM. Looking forward to a fruitful collaboration between the Centre and…
Also Read
- Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
- Gold and Silver Price Today: మరింత తగ్గిన బంగారం ధరలు.. నేటి గోల్డ్, సిల్వర్ రేట్లు ఇవే
- Srisailam Temple: శ్రీశైలం మల్లన్న దర్శనానికి పోటెత్తిన భక్తులు
- TDP Leadership Conclave: ఎమ్మెల్యేలకు చంద్రబాబు టాస్క్.. స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే.. లేదంటే పని చేయనట్టే..!
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 11, 2023
Read Also: KCR Health: కేసీఆర్ ను పరామర్శించిన చంద్రబాబు.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించానని.. ఎప్పటిలాగే, ప్రధానమంత్రిని కలవడం ఒక గౌరవం.. విశేషం అంటూ విజయసాయి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫలవంతమైన సహకారం కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా, ఆర్థిక సహకారం, కేంద్రప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో ఏపీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానితో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అంతకుముందు విజయసాయి రెడ్డి రాజమండ్రి విమనాశ్రయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంపై ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. . రాజమండ్రి విమానాశ్రయంలో రూ.350 కోట్లతో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ భవనం.. గోదావరి ప్రాంతానికి ఒక వరం.. ప్రస్తుతం ఉన్న భవనం కంటే 400 రెట్లు ఎక్కువ.. 10 రెట్ల ప్రయాణికులకు మేలు జరగుతుందన్నారు.
The new terminal building at Rajahmundry airport being constructed at a cost of ₹350 cr. shall prove to be a boon for the Godavari region. At 400 times the existing building and serving 10 times the no. of passengers up to 30lakh per year, it is nothing short of a marvel.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) December 11, 2023
తాజావార్తలు
-
Shaque: అనుమానాలతో పిచ్చెక్కించడానికి వస్తున్న పరిణీతి చోప్రా మిస్టరీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
Best Scooters for Women: మహిళలకు బెస్ట్ స్కూటర్లు ఇవే.. స్టైలిష్ లుక్, మంచి మైలేజ్‌తో అదిరిపోయే మోడల్స్!
-
Bhatti Vikramarka: సింగరేణి 128 మంది ఉద్యోగుల భవితవ్యంపై నిర్ణయం.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన.!
-
JrNTR : ఆదర్శకుటుంబానికి తోడుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్
-
Asia Cup 2026: జిత్తులమారి వస్తున్నాడు.. టీమిండియాకు మరోసారి ట్రోఫీ వివాదం తప్పదా?
ట్రెండింగ్
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!