బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముందు రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా కల్పించాలనే తన దీర్ఘకాల డిమాండ్‌ను లేవనెత్తారు.
2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కన్నడ సినీ నటుడు శివ రాజ్‌కుమార్‌కు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ టికెట్ ఆఫర్ చేశారు. ఆదివారం బెంగళూరులో జరిగిన 'ఈడిగ' కమ్యూనిటీ సదస్సులో డీకే శివకుమార్ మాట్లాడుతూ.. లోక్‌సభలో ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని శివ రాజ్‌కుమార్‌ను కోరినట్లు చెప్పారు.
రేపు వైఎస్సార్ లా నేస్తం నిధులను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేయనున్నారు. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదును సీఎం జగన్ జమ చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొననున్నారు.
మహారాష్ట్రలోని కసర రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఎనిమిది ఎక్స్‌ప్రెస్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎనిమిది ఎక్స్ ప్రెస్ రైళ్లలో నాలుగింటిని దారి మళ్లించినట్లు సెంట్రల్ రైల్వే తెలిపింది.
రాజమండ్రి గోరక్షణ పేట ప్రధాన రహదారిలో భూమి కుంగిపోయింది. రోడ్డు మధ్య బీటలు వారి అమాంతంగా గొయ్యి పడింది. ఒక్కసారిగా భూమి కుంగిపోవటంతో స్థానికులు భయాందోళనలు గురయ్యారు.
పర్యాటకులతో సందడిగా ఉండే విశాఖ ఆర్కే బీచ్ యుద్ధ భూమిని తలపించింది. అత్యాధునిక యుద్ధనౌకలు, విమానాలు గర్జించాయి. శత్రువులపై చకచక్యంగా విరుచుకుపడే విన్యాసాలు అబ్బురపరిచాయి. హాక్ విమానాల ఎదురుదాడి నైపుణ్యం., యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ యుద్ధ విమానాలు బాంబుల దాడి వంటివి అబ్బురపరిచాయి.
మిచౌంగ్ తుఫాన్ కొన్ని జిల్లాలను అతలాకుతలం చేసిందని ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తుఫాన్ వస్తుందనే సమాచారంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుందని.. దీని వల్ల ప్రాణ నష్టాన్ని నివారించగలిగిందని మంత్రి తెలిపారు. ఈ సంక్షోభం నుంచి రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నాన్ని చంద్రబాబు చేస్తున్నారని.. జగన్‌పై బురద చల్లుతున్నారని ఆయన మండిపడ్డారు.