తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శ్రీకారం చుట్టారు. రాజమండ్రి విమానాశ్రయ టర్మినల్ విస్తరణ పనులకు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు.
తెలంగాణలో సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో టీడీపీ పూసుకుని, రాసుకుని ప్రచారం చేయటం వల్లే కాంగ్రెస్ ఓడిందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఓడారు.. కాబట్టి ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉంటుందన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీలకతీతంగా అర్హులైన ప్రజలందరికి సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని మార్కాపురం ఎమ్మెల్యే కేపీ నాగార్జున రెడ్డి అన్నారు.
కార్తీక మాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు దర్శనాలలో భాగంగా క్షీరా రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని మంత్రి రోజా పేర్కొన్నారు. క్షీరా రామలింగేశ్వర స్వామి పార్వతి అమ్మవార్ల ఆశీస్సులు జగనన్నకు ఎల్లప్పుడూ ఉండాలన్నారు.
ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం కందుల ఓబుల్ రెడ్డి ప్రాజెక్టు (గుండ్లకమ్మ రిజర్వాయర్)కు చెందిన మరో గేటు కొట్టుకుపోయింది.. గతంలో కొట్టుకుపోయిన 3వ గేటు మరమ్మతులు ఇప్పటి వరకు పూర్తిస్థాయిలో చేయలేదనే విమర్శలు వినిపిస్తుండగా.. శుక్రవారం రాత్రి రెండో గేటు అడుగు భాగం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే.
చలికాలంలో మనకు దాహం ఎక్కువగా వేయదు.. దీని కారణంగా మనం తక్కువ నీరు తాగుతాము. కానీ, దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి మన శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఇది మన శరీరంలోని ఎలక్ట్రోలైట్‌లను అసమతుల్యత చేస్తుంది, దీని కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి చలికాలంలో నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం.
ఎప్పుడూ లేని విధంగా రాజకీయాలు ఈసారి ఇరిటేషన్ తెప్పిస్తున్నాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. తన మీద, తన కుమారుడి మీద తరచూ అర్థం లేని ఆరోపణలు చేస్తూ బురద చల్లాలని చూడటం విసుగు తెప్పిస్తుందన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అవినీతికి కేరాఫ్ అంటూ తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో వందల కోట్లు అవినీతికి ప్రజా ప్రతినిధులే పాల్పుడుతున్నారని ఆమె వ్యాఖ్యానించారు.