వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా దానిని స్వాగతించాలని, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆ పార్టీలోని అసంతృప్తి ఎమ్మెల్యేలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ హితవు పలికారు.
జనవరి 3వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకినాడలో పర్యటించనున్నారు. వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం జగన్ బయలుదేరనున్నారు.
తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు.
జనవరి 22న అయోధ్యలో జరగనున్న రామమందిర ప్రతిష్ఠాపన మహోత్సవం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు హడావిడిగా వెళ్లవద్దని ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కోరారు.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య అక్టోబర్ నుంచి యుద్ధం కొనసాగుతోంది. ఇజ్రాయెల్ ఇప్పటివరకు గాజాలోని హమాస్‌కు భారీ నష్టం కలిగించింది. గాజాపై ఇజ్రాయెల్ జరిపిన తాజా దాడిలో దాదాపు 100 మంది పాలస్తీనియన్లు మరణించగా.. 158 మంది గాయపడ్డారు.
రోజురోజుకు మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు చూస్తుంటే.. మగవాళ్లతో స్నేహం చేయటమే ఆడవారు చేస్తున్న నేరమా అనిపిస్తోంది. కొంచెం మంచిగా నటించి మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన 23 ఏళ్ల మోడల్‌పై సిమ్లాలోని లూథియానాకు చెందిన ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.
జనవరి 1 నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్-2024) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని నుమాయిష్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు.
మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు.
న్యూ ఇయర్ వేళ నార్కోటిక్ పోలీసులు సరికొత్త స్టెప్ తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోని డ్రగ్స్ డిటెక్షన్ టెస్ట్ కిట్స్‌ను రంగంలోకి దించింది నార్కోటిక్ టీం. రేపటి నుంచి పరీక్షలు చేయడానికి నార్కోటిక్ బ్యూరో సన్నద్ధమవుతోంది. ఈ మేరకు తెలంగాణ నార్కోటిక్ బ్యూరోకు కొత్త పరికరాలు చేరాయి.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ ఇళ్ల స్థలాల్లో 35 వేల కోట్లు స్కాం జరిగిందని అనడానికి ఆధారాలు చూపిస్తావా.. అంటూ తీవ్రంగా మండిపడ్డారు.