10th Exams Schedule: తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ విడుదలైంది. మార్చ్ 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వెల్లడించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.
Read Also: Numaish Exhibition: జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్
ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ పరీక్షలు వేర్వేరు రోజుల్లో నిర్వహిస్తామన్నారు. 18న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీష్, 23న మ్యాథ్స్, 26న సైన్స్ మొదటి పేపర్, 28న సైన్స్ 2వ పేపర్, 30న సోషల్ స్టడీస్, 1వ తేదీన ఒకేషనల్ కోర్సు వారికి సంస్కృతం, అరబిక్ మొదటి పేపర్, 2న రెండో పేపర్ పరీక్షలు జరుగుతాయన్నారు. 10వ తరగతి పరీక్షలను 5 లక్షల 6 వేలకు పైగా విద్యార్థులు రాయనున్నారు.