Numaish Exhibition: జనవరి 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నుమాయిష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Numaish Exhibition: జనవరి 1 నుంచి హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్(నుమాయిష్-2024) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం అవుతుందని నుమాయిష్ ప్రెసిడెంట్, రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. 8 దశాబ్దాలుగా తెలంగాణకు నుమయిష్ ఓ ప్రైడ్ అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read
- Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
- Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
- PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
- BRICS: బ్రిక్స్‌లో కీలక పరిణామం.. యుద్ధం వేళ, ఇరాన్-యూఏఈ చర్చలు..
ఎన్నో రాష్ట్రాల నుండి విజిటర్స్ గతం నుంచి వస్తున్నారని.. నిజాం కాలం నుంచి ఈ ప్రదర్శన ఉందన్నారు. సేవా దృక్పథంతో సొసైటీ సభ్యులు పనిచేస్తున్నారని మంత్రి వెల్లడించారు. తనను సొసైటీ ప్రెసిడెంట్‌గా ఎంచుకోవడం సంతోషమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి జనవరి 1 ప్రారంభిస్తారని వెల్లడించారు. పారిశ్రామిక ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఫైర్, హెల్త్, అంబులెన్స్ విషయంలో జాగ్రత్తలు సొసైటీ తీసుకుందన్నారు. నుమాయిష్ ఎగ్జిబిషన్‌కు వచ్చేవాళ్లు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. 15 రోజుల్లో లక్షలాది మంది ప్రజలు ప్రదర్శనను సందర్శిస్తారని మంత్రి చెప్పారు.
Read Also: Telangana: కొడంగల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీని ఏర్పాటు చేసిన ప్రభుత్వం
ఎంతో మంది ఇక్కడికి వచ్చే వ్యాపారం చేస్తున్నారని, వారికి ప్రోత్సాహం సొసైటీ అందిస్తుందన్నారు. స్టాల్స్ విషయంలో సొసైటీ జాగ్రత్తలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రదర్శనతో వచ్చే ఆదాయంతో 20కి పైగా విద్యాసంస్థలు నడుస్తున్నాయని.. 30వేల మంది మహిళలకు విద్య అందుతుందన్నారు. వాణిజ్య వ్యాపారంలో ఈ నుమయిష్ ఎంతోగానో ఉపయోగపడుతుందన్నారు. మెట్రో రైలు కోసం స్పెషల్ టికెట్ కౌంటర్ ఏర్పాట్లు చేశామన్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: చిన్మోయ్ కృష్ణదాస్ కన్నీరు.. హిందువుల పరిస్థితిపై బెంగాల్ సీఎం కామెంట్స్..
-
Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
-
Bigg Boss Telugu: బిగ్ షాక్.. కంటెస్టెంట్లు తాగిన పాల గ్లాస్లు కడిగిన నాగార్జున..
-
PM Modi-Xi Jinping: ఒకరి నుంచి మరొకరం నేర్చుకోవచ్చు: మోడీతో భేటీలో జిన్‌పింగ్..
-
Free Cool Drinks Go Viral : ఉచితం అనగానే ఎగబడ్డారు.. బాటిల్ చూస్తే షాక్..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!