Top Headlines @5PM on 1st January 2024, Top Headlines @5PM, telugu news, top news, new year celebrations, Telangana, Andhrpradesh, National News, Tollywood Sports
చంద్రబాబు నాయుడిపై ఎంపీ మిథున్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అని చెప్పి మోసం చేసిన ఘనత చంద్రబాబు నాయుడుది అంటూ తీవ్రంగా మండిపడ్డారు.
నూతన సంవత్సర వేడుకలు ముగ్గురు యువకుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ఏలూరు జిల్లాలో న్యూఇయర్ రోజున విషాదం చోటుచేసుకుంది. అగిరిపల్లి మండలం కనసానపల్లిలో మద్యం మత్తులో బుల్లెట్ బండి నడుపుతూ బావిలోకి దూసుకెళ్లాడు ఓ యువకుడు. బుల్లెట్‌పై ప్రయాణిస్తున్న ముగ్గురు యువకులలో ఇద్దరు మృతి చెందగా.. మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి.
కాకినాడ జిల్లాలోని తునిలో న్యూఇయర్ వేడుకల్లో తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. న్యూఇయర్ వేడుకల్లో టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తునిలోని సాయి వేదిక ఫంక్షన్ హల్‌లో యనమల సోదరులు న్యూ ఇయర్ వేడుకలు ఏర్పాటు చేశారు.
నీతి నిజాయితిపరులే రాజకీయాల్లోకి రావాలి అంటూ ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు చేశారు. సంపాదన కోసం కొంత మంది రాజకీయాల్లోకి రావడం ఫ్యాషన్‌గా మారిందన్నారు.
వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యూఎస్‌ఏ సోషల్ మీడియా కమిటీని నియమించారు. ఈ సోషల్ మీడియా కమిటీకి కన్వీనర్‌గా గంగిరెడ్డిగారి రోహిత్‌ని నియమించారు.
ఒక్క బిర్యానీ తిని ఏడు లక్షల రూపాయల కారు గెలుచుకున్నాడు ఓ లక్కీ ఫెలో. తిరుపతి నగరంలోని రోబో హోటల్లో నిర్వహించిన బిర్యాని లక్కీ డ్రా లో రాహుల్ అనే వ్యక్తి నిస్సాన్ మాగ్నట్ కారు ఉచితంగా పొందాడు.
తమ అభిమాన నటుడి 68వ చిత్రానికి టైటిల్ ప్రకటన కోసం దళపతి విజయ్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్ తాజాగా రివీల్ అయ్యాయి. ఈ సినిమాకు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం' అనే టైటిల్ పెట్టారు. న్యూ ఇయర్ కానుకగా తాజాగా టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్.
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో, కొత్త విశ్వాసంతో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చంద్రబాబు అన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం హుండీకి కాసుల వర్షం కురుస్తోంది.