ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త ఏడాదికి పొలిటికల్ కలర్ పులుముకుంది. ముఖ్యంగా వైసీపీ నేతలు విందులు, ఆత్మీయ సమావేశాలతో కేడర్‌లో జోష్ నింపే పనిలో పడ్డారు. ఈ సారి టికెట్ రాని అధికార పార్టీ నేతలు, టికెట్ వస్తుందని ఆశాభావంలో ఉన్న నాయకులు ఈ న్యూ ఇయర్‌ను గట్టిగా ప్లాన్ చేస్తున్నారు.
షీనా చోహన్ తన నూతన చిత్రం "అమర్-ప్రేమ్" పూర్తి చేసి విజయవంతంగా 2023 ఏడాదికి గుడ్ బై చెప్పనున్నారు. ట్రయాంగిల్ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కించిన "అమర్-ప్రేమ్" వచ్చే ఏడాది ప్రపంచ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయడానికి సిద్ధంగా ఉంది. జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డు అందుకున్న సువేందు రాజ్ ఘోష్ తెరకెక్కించిన ఈ చిత్రం ప్రతిష్టాత్మక జాతీయ, అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో ప్రదర్శించబడుతుంది.
కొత్త సంవత్సరం నేపథ్యంలో ఏపీలో పెన్షన్ రూ.3వేలకు పెంచింది సర్కారు. విశ్వసనీయతకు అర్థం చెబుతూ, మానవత్వానికి ప్రతిరూపంగా, పెన్షన్లను క్రమంగా రూ.3వేలకు పెంచుకుంటూ పోతామని ఇచ్చిన హామీని సంపూర్ణంగా నెరవేర్చారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద ఇకపై ప్రతినెలా రూ. 3వేల పెన్షన్ ఇవ్వనున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరి గౌరవం పెరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం లక్కీ జిల్లా పరిషత్ పాఠశాల మైదానంలో బొబ్బిలి నియోజకవర్గ గడపగడపకు ముగింపు కార్యక్రమ బహిరంగ సభకు మంత్రి బొత్స సత్యనారాయణ హాజరయ్యారు.
న్యూజిలాండ్ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ దేశంలో పెద్దనగరమైన ఆక్లాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు ప్రారంభమయ్యాయి. 2024కు గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు కివీస్ ప్రజలు. ఈ సందర్భంగా ప్రదర్శించిన లేజర్, ఫైర్‌వర్క్స్ షో అబ్బురపరిచాయి.
ప్రతి ఒక్కరికి యవ్వనంగా కనిపించాలని, అందంగా ఉండాలని అనిపిస్తుంది. దీనికోసం రకరకాల మందులు వాడేవాళ్లు కూడా ఉంటారు. ఈ గొప్ప ఆహార పదార్థాన్ని మీ డైట్‌లో చేర్చుకుంటే మీరు 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపిస్తారు. మీరు కూడా 50 ఏళ్ల వరకు యవ్వనంగా కనిపించాలంటే, మీ రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా బ్రకోలీని చేర్చుకోవాలి.
చేతిలో చీపురు పట్టుకుని రోడ్ల మీద ఉన్న చెత్త ఊడ్చేందుకు ప్రయత్నించిన మున్సిపల్ కమిషనర్‌ను పారిశుద్ధ్య కార్మికులు అడ్డుకున్న సంఘటన నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ పట్టణంలో గత నాలుగు రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేపట్టారు.
నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవడానికి, ప్రజలు తమ స్నేహితులతో కలిసి ప్రయాణించడానికి లేదా పార్టీ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆల్కహాల్ ఆరోగ్యానికి ఎంత హానికరమో తెలిసినప్పటికీ, చాలా మంది దానిని తమ వేడుకల్లో భాగం చేసుకోవడానికి ఇష్టపడతారు, కానీ దాని వల్ల కలిగే హ్యాంగోవర్ మీ నూతన సంవత్సరాన్ని పాడు చేస్తుంది. హ్యాంగోవర్‌ను ఎలా వదిలించుకోవచ్చో తెలుసుకోండి.
ప్రధాని నరేంద్ర మోడీ రైల్వేలలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పేర్కొన్నారు. అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌కు విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో ఆయన స్వాగతం పలికారు.