YSRCP: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యూఎస్‌ఏ సోషల్ మీడియా కమిటీని నియమించారు. ఈ సోషల్ మీడియా కమిటీకి కన్వీనర్‌గా గంగిరెడ్డిగారి రోహిత్‌ని నియమించారు. ఆదిత్య పల్లేటి, కిరణ్‌కుమార్ చిల్లా, బంక తేజ యాదవ్, మైలం సురేష్‌లను కో-కన్వీనర్‌లుగా నియమించారు. త్వరలో పలు దేశాల్లో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న వాళ్ళను గుర్తించి కమిటీలను ఏర్పాటు చేయబోతుంది. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలు దేశాల్లో ఉన్న పార్టీ కార్యకర్తలు, సానుభూతిపరులను గుర్తించి పార్టీని మరింత బలోపేతం చేయడానికి సిద్దమవుతున్నారు.
Read Also: Lucky Draw: బిర్యాని తిన్నాడు… కారు గెలిచాడు!
గతంలో ఎన్నడూ లేని విధంగా సోషల్ మీడియా విభాగం చురుగ్గా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా పలు దేశాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చురుగ్గా కనిపిస్తుంది. ఈ మధ్యనే సోషల్ మీడియా కో- ఆర్డినేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జల భార్గవ్ రెడ్డి పలు దేశాల్లో గ్రీట్ అండ్ మీట్ కార్యక్రమాలను నిర్వహించి సోషల్ మీడియా కార్యకర్తలను ఉత్తేజపరుస్తున్నారు.