ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి కుటుంబంతో పాటు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లారు. భర్త అనిల్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కుటుంబసభ్యులతో కలిసి కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు చేరుకుని, అక్కడి నుంచి ముఖ్యమంత్రి నివాసానికి షర్మిల వెళ్లారు.
గురుగ్రామ్‌లోని ఓ హోటల్‌లో 27 ఏళ్ల మోడల్ దివ్య పహుజా హత్య ఆ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. దివ్య పహుజా బల్దేవ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిసింది. సంచలనం సృష్టించిన హత్య కేసులో ఢిల్లీకి చెందిన అభిజీత్ అనే వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి భారత న్యాయ సంహితలోని నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రక్కు డ్రైవర్లతో స్థానిక కలెక్టర్ వ్యవహరించిన తీరు వివాదాస్పాదమైంది. ఈ నేపథ్యంలో షాజాపూర్ జిల్లా కలెక్టర్‌ను తొలగించాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఆదేశించారు.
ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆశీస్సులు అందించిన మహిళా శక్తికి కృతజ్ఞతలు అని అన్నారు.
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్‌కు జనసేనలో కీలక బాధ్యతలను అప్పగించారు. విశాఖ జిల్లా అధ్యక్షుడిగా వంశీకృష్ణ యాదవ్‌ను పవన్ కళ్యాణ్ నియమించారు. వంశీ నియామకాన్ని ఖరారు చేస్తూ జనసేన అధికారిక ప్రకటన చేసింది.
చంద్రబాబు సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు.
ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 11 అంశాలతో ఏపీ బీజేపీ రాజకీయ తీర్మానం చేసింది. ఈ రాజకీయ తీర్మానాన్ని ఏపీ బీజేపీ ఏకగ్రీవంగా ఆమోదించింది.
దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించారు. 55 పరుగులతో దక్షిణాఫ్రికాను ఆలౌట్ చేశారు. భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి సెషన్‌లోనే ఆలౌట్ కావడం గమనార్హం. సెంచూరియన్‌లో లొంగిపోయిన భారత జట్టు కేప్‌టౌన్ టెస్టులో అద్భుతంగా పునరాగమనం చేసింది.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ముఖ్యమంత్రి జగన్ పరామర్శించనున్నారు. గత నెల 8వ తేదీన కేసీఆర్ గజ్వేల్ ఫాంహౌజ్‌లో కాలుజారి పడడంతో తుంటి ఎముక విరిగన సంగతి తెలిసిందే.