PM Modi: మహిళా శక్తికి కృతజ్ఞుడను.. కేరళలోని త్రిసూర్‌లో ప్రధాని మోడీ ప్రసంగం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi:ఈ ఏడాది చివర్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ ప్రచారానికి మెగా పుష్‌గా భావించే ప్రధాని నరేంద్ర మోడీ దక్షిణ భారత పర్యటనలో 2వ రోజు త్రిసూర్‌లో భారీ రోడ్‌షో నిర్వహించారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగించారు. బుధవారం కేరళలోని త్రిసూర్‌లో జరిగిన మహిళా సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. ఇంత పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి తమ ఆశీస్సులు అందించిన మహిళా శక్తికి కృతజ్ఞతలు అని అన్నారు.
Read Also: Amara Raja Group : తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు
Also Read
- Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
- Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
- Vangaveeti Radha Joins Jana Sena: జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ.. కండువా కప్పి ఆహ్వానించిన పవన్.. మేయర్ రేసులో..?
- CJP: ‘‘సంతకాలు చేసి ఉల్లంఘించారు’’.. కాక్రోచ్ నేతలను జైలుకు పంపడానికి కారణాలివే.!
ప్రస్తుతం దేశంలో మోడీ హామీ గురించి మాట్లాడుతున్నారని, అయితే అభివృద్ధి చెందిన దేశంగా భారత సంకల్పాన్ని సాధించడంలో దేశంలోని మహిళా శక్తి అతిపెద్ద హామీ అని తాను నమ్ముతున్నానని ప్రధాని మోడీ అన్నారు. దురదృష్టవశాత్తు, స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, ఎల్‌డీఎఫ్-యూడీఎఫ్ ప్రభుత్వాలు మహిళా శక్తిని బలహీనంగా భావించాయి. లోక్‌సభ, అసెంబ్లీల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉందన్నారు.
మహిళల సభను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అదృష్టవశాత్తూ తాను కాశీ పార్లమెంటరీ నియోజకవర్గం, శివ నగరం నుంచి ఎంపీని, ఇక్కడ వడక్కునాథన్ ఆలయంలో శివుడు కూడా ఉన్నాడు. నేడు కేరళ సాంస్కృతిక రాజధాని త్రిసూర్ నుంచి వెలువడే శక్తి మొత్తం కేరళలో కొత్త ఆశలను నింపుతుందన్నారు. ఈరోజు శివగంగై మహారాణి వేలు నాచ్చియార్ జయంతి అని, ఈరోజు సంఘ సంస్కర్త సావిత్రీబాయి ఫూలే జయంతి కూడా అని ప్రధాని మోడీ వెల్లడించారు. స్త్రీ శక్తి ఎంత గొప్పదో ఈ రెండింటి నుండి మనం నేర్చుకోవచ్చన్నారు. భారతదేశ స్వాతంత్ర్యం, సంస్కృతి, రాజ్యాంగ రూపకల్పనలో కేరళ కుమార్తెలు ముఖ్యమైన పాత్ర పోషించారని ప్రధాని మోడీ తెలిపారు.
తాజావార్తలు
-
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
-
IDBI Bank Stake Sale: IDBI బ్యాంక్‌లో భారీ మార్పు! 60.72% వాటాల విక్రయం.. డీల్ విలువ రూ.52,878 కోట్లు
-
Tirumala Laddu Ghee Case: కల్తీ నెయ్యి వ్యవహారంలో కీలక పరిణామం.. భారీగా ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ
-
Congress Councillors: కాంగ్రెస్‌కు ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా.. !
-
Meerut Blue Drum Murder: మీరట్ ‘‘బ్లూ డ్రమ్ మర్డర్’’.. మరణశిక్ష విధిస్తూ ‘‘భగవద్గీత’’ను ప్రస్తావించిన న్యాయమూర్తి.!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..