తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ వనవాసం ముగిసిందని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి వెల్లడించారు. మొన్న కర్ణాటకలో కాంగ్రెస్.. నిన్న తెలంగాణలో కాంగ్రెస్ .. రేపు ఏపీలో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వై నాట్ ఏపీ కాంగ్రెస్ అనేది మా నినాదమని ఆయన స్పష్టం చేశారు.
అమెరికాను కుదిపేసిన హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం మరోసారి తెరపైకి వచ్చింది. సెక్స్ కుంభకోణం ఆరోపణలపై విచారణ కోసం ఎదురుచూస్తూ 2019లో ఆత్మహత్య చేసుకున్న మిలియనీర్, జెట్-సెట్టింగ్ ఫైనాన్షియర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన కొన్ని పత్రాలను యూఎస్‌లోని ఓ కోర్టు బుధవారం విడుదల చేసింది.జెఫ్రీ ఎప్‌స్టీన్‌కు సంబంధించిన పత్రాలలో అమెరికాకు చెందిన చాలా మంది పెద్ద వ్యక్తుల పేర్లు కనిపించాయి.
నాలుగేళ్ల క్రితం అమెరికా డ్రోన్ దాడిలో ఇరాన్ జనరల్ ఖాసిం సులేమానీని హతమార్చింది. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా సమాధి దగ్గర నివాళులు అర్పించేందుకు ప్రజలు గుమికూడిన సమయంలో రెండు పెద్ద బాంబు పేలుళ్లు ఆ ప్రాంతాన్ని అతలాకుతలం చేశాయి. ఈ పేలుడులో కనీసం 100 మందికి పైగా మరణించగా.. 170 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. జనవరి 3, 2020న ఇరాక్ రాజధాని బాగ్దాద్ సమీపంలో ఖాసిం సులేమానీని అమెరికా చంపినప్పుడు, కాన్వాయ్‌లోని రెండు కార్లు దాడికి గురయ్యాయి.
ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సిట్టింగ్ స్ధానమైన అనకాపల్లి వీడి వెళ్లాల్సి వస్తుందన్నందుకు కంటతడి పెట్టుకున్నారు. రాజకీయ ప్రయాణంలో తనకు సహకరించిన కార్యకర్తలు, నాయకుల రుణం ఎప్పటికైనా తీర్చుకుంటామని ఆయన అన్నారు.
ఇరాన్‌లోని కెర్మాన్ నగరంలో బుధవారం జరిగిన రెండు పేలుళ్లలో 100 మందికి పైగా మరణించారు. పలువురు గాయపడ్డారు. జనరల్ ఖాసిం సులేమాని వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ పేలుళ్లు జరిగాయి. 2020లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో సులేమానీ మరణించారు. అతను రివల్యూషనరీ గార్డ్స్ ఎలైట్ ఖుద్స్ ఫోర్స్‌కు అధిపతి. ఆయనను కెర్మాన్‌లో ఖననం చేశారు.
కుటుంబంలో చిచ్చు పెడుతున్నారంటూ సీఎం జగన్ చేసిన కామెంట్లపై టీడీపీ అధినేత చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్‌లో ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ల ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన ప్రసంగించారు. తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇరాన్ జనరల్ ఖాసీం సులేమానీ హత్యకు గురై నాలుగో వార్షికోత్సవం సందర్భంగా ఆయన సమాధి సమీపంలో జరిగిన రెండు శక్తివంతమైన బాంబు పేలుళ్లలో కనీసం 73 మంది మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తిరువూరులో టీడీపీ సమన్వయ కమిటీ భేటీలో జరిగిన వివాదంపై విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీలో కేశినేని చిన్ని ఎవరు ?.. చిన్ని ఎంపీనా, ఎమ్మెల్యేనా ? అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు జరుగుతాయనే తాను సభలకు దూరంగా ఉంటున్నానని ఎంపీ తెలిపారు.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 153 పరుగులకు ఆలౌట్ అయింది. టీ విరామ సమయానికి 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసిన టీమిండియా చివరి సెషన్‌లోనే ఆరు వికెట్లు కోల్పోయింది. సౌతాఫ్రికా బౌలర్లు లుంగి ఎంగిడి, రబాడ వరుసగా వికెట్లు పడగొట్టి మ్యాచ్ పరిస్థితిని మార్చేశారు.