YCP Leaders Join TDP: చంద్రబాబు సమక్షంలో వివిధ జిల్లాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వారికి పార్టీ అధినేత చంద్రబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విశాఖ, కడప, అనంతపురం, చీరాల, బాపట్ల, పార్వతీపురం నియోజకవర్గాల నుంచి వచ్చిన వైసీపీ నేతలు తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు సమక్షంలో విజయసాయిరెడ్డి బావమరిది ద్వారకానాథ్ రెడ్డి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ సీనియర్ నేత దాడి వీరభద్రరావు కూడా టీడీపీలో చేరారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య, బాపట్ల వైసీపీ జెడ్పీటీసీ వేణుగోపాల్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకున్నారు.
Read Also: Andhrapradesh: ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశం.. 11 అంశాలతో రాజకీయ తీర్మానం
టీడీపీలో చేరిన సందర్భంగా వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మళ్లీ కోలుకోలేని విధంగా ఏపీని జగన్ అప్పులపాలు చేశారని ఎమ్మెల్సీ రామచంద్రయ్య ఆరోపించారు. ప్రజల చర్మం వలిచి పన్నులు కట్టిస్తే తప్ప జగన్ చేసిన అప్పులు తీరవన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిపై జగన్‌కు చెప్పినా వినే పరిస్థితి లేదన్నారు. నాలాగే వైసీపీలో ఎంతో మంది ఉన్నారు.. సమయానుకూలంగా బయటకు వస్తారన్నారు. తెలుగుదేశంలో చేరేందుకే చంద్రబాబుని కలిశానని.. పదవుల కంటే సమాజమే ముఖ్యమని తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించానన్నారు.