గుంటూరు రైల్వేస్టేషన్‌లో మూడు రైళ్లను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. నరసాపురం నుంచి హుబ్లీకి, గుంటూరు నుంచి విశాఖకు, రేణిగుంట నుంచి నంద్యాలకు మూడు రైళ్లను కేంద్రమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మూడు రైళ్లను ప్రారంభించామని, నంద్యాల నుంచి రేణిగుంట రైలు తిరుమల భక్తులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుందని తెలిపారు
ఇటీవల టీడీపీకి రాజీనామా చేసిన కేశినేని నానిపై టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న మరోసారి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేశినేని నాని అవినీతి పరుడు.. నిరూపించడానికి మేం సిద్ధం ఆయన వ్యాఖ్యానించారు. కేశినేని నాని బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పెంత..?.. తిరిగి చెల్లించింది ఎంత..?.. తాను తీసుకున్న బ్యాంకుల అప్పుల వివరాలు కేశినేని నాని వెల్లడించగలరా..? అంటూ బుద్దా వెంకన్న సవాల్ విసిరారు.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సమస్య లేదని, బాలినేని జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని.. ఆయన స్థానం ఆయనకు ఉంటుందన్నారు. మూడు లిస్టులు ఇప్పటికే రిలీజ్ చేశాం.. త్వరలో మరో లిస్ట్ ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు.
కాపు ఉద్యమ నేత ఏ పార్టీలో చేరతారనే విషయంపై కొంచెం స్పష్టత వచ్చినట్లుగా అనిపిస్తోంది. వైసీపీలోకి వచ్చే ప్రసక్తే లేదని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం క్లారిటీ ఇచ్చారు. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కలవడానికి ముద్రగడ పద్మనాభం ఇష్టపడలేదని తెలుస్తోంది. తోట త్రిమూర్తులను రావొద్దని, వచ్చినా కలవనని పద్మనాభం చెప్పినట్లు సమాచారం.
ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే కీలక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జులను నియమించే పనిలో పడ్డారు. తాజగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది.
ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైపు పార్టీలు చూస్తున్నాయి. ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది.