ఏపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంతో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. ఈ సమయంలో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ దక్కదని నిర్ధారణకు వచ్చిన నేతలు వైసీపీని వీడేందుకు మొగ్గు చూపుతున్నారు. తిరువూరు నుంచి వైసీపీ తరపున గెలుపొందిన రక్షణనిధికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి జగన్ చెప్పేసినట్లు సమాచారం.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచారని ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాకూర్ విమర్శించారు. కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ యువతకు ఉద్యోగాల కల్పనలో విఫలమయ్యారని ఆరోపించారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అవార్డుల పంట పండింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో ఆంధ్రప్రదేశ్ నాలుగు జాతీయ అవార్డులు, ఒక రాష్ట్ర స్థాయి అవార్డు గెలుచుకుంది. దక్షిణ భారత దేశంలో క్లీన్ సిటీలలో ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది.
ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వైసీపీలో ఇంఛార్జుల మార్పు కొనసాగుతూనే ఉంది. టికెట్టు విషయంలో చర్చించేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి పార్టీ నాయకులు క్యూ కడుతున్నారు. తాజాగా పార్టీ పెద్దల నుంచి పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, నేతలకు పిలుపు వచ్చింది. నియోజకవర్గ ఇంఛార్జుల మార్పులపై సీఎం వైఎస్ జగన్ తుది కసరత్తు చేస్తున్నారు.
వైఎస్ షర్మిలకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే ఇబ్బందికర పరిస్థితులు నెలకొంటాయని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిక కుట్రతో కూడినదని ఆయన వ్యాఖానించారు. ఒక రాష్ట్రంలో చెల్లని నాణెం ఇంకో రాష్ట్రంలో ఎలా చెల్లుతుందని, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బతికించే నాయకులు లేరా అని ప్రశ్నించారు.
చంద్రబాబు సభలో జనం లేక, ఖాళీ కుర్చీలను చూసి పిచ్చిపట్టి మాట్లాడుతున్నారని మంత్రి దాడిశెట్టి రాజా ఎద్దేవా చేశారు. చంద్రబాబు 'రా కదలిరా' బహిరంగ సభ అట్టర్‌ప్లాప్ అయ్యిందన్నారు. ప్రజలు చంద్రబాబు మాటలను నమ్మడం లేదని ఆయన అన్నారు.
ఏపీలో కులగణన ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేర్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జనవరి 19 తేదీ నుంచి 28 తేదీలోగా కులగణన ప్రక్రియ పూర్తి చేయాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది.
ట్టకేలకు టీటీడీ విజ్ఞప్తికి కేంద్ర ఆర్కియాలజీ శాఖ సానుకూలంగా స్పందించింది. అలిపిరి వద్ద వున్న పాదాల మండపం, తిరుమల పుష్కరిణి వద్ద వున్న అహ్నిక మండపం శిథిలావస్థలో వుండడంతో పున:నిర్మించాలని పాలకమండలి నిర్ణయించింది.