MP Vijayasai Reddy: మూడు లిస్టులు రిలీజ్ చేశాం.. త్వరలో మరో జాబితా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MP Vijayasai Reddy: మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఎటువంటి సమస్య లేదని, బాలినేని జిల్లాకు వైసీపీలో అత్యంత విలువైన నాయకుడని వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి తెలిపారు. పార్టీలో ఆయనకున్న ప్రాధాన్యత తగ్గదని.. ఆయన స్థానం ఆయనకు ఉంటుందన్నారు. మూడు లిస్టులు ఇప్పటికే రిలీజ్ చేశాం.. త్వరలో మరో లిస్ట్ ఉంటుందని విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలు అన్న తర్వాత పరస్పర ఆరోపణలు సహజమని, ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మా నాయకుడ్ని టీడీపీ నేతలు విమర్శిస్తే తిప్పికొట్టడం మా బాధ్యత అంటూ ఆయన పేర్కొన్నారు. ఆ బాధ్యతను ప్రతీ ఒక్కరూ నిర్వర్తించాలన్నారు.
Read Also: Jogi Ramesh: పెనమలూరు నుంచి చంద్రబాబు బరిలోకి దిగినా నేను సిద్ధం..
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
అంతే తప్ప తిట్టడం అనే పదాన్ని వాడకూడదన్నారు. కావాలనే టీడీపీ వాళ్లు తిట్టమన్నారని ఎందుకు ఆరోపణలు వారే చెప్పాలని, తిట్టమని ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు.. మేము అలా చెప్పమన్నారు. మా నేతను విమర్శిస్తే మేమే సమాధానం చెప్పాలన్నారు. వైఎస్ మరణంపై గతంలోనే విచారణ జరిగింది.. రిపోర్టును అప్పటి కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారన్నారు. టీడీపీ దొంగ ఓట్ల వ్యవహారంపై సీఈసీకి పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశామని విజయసాయిరెడ్డి వెల్లడించారు. గత ఎన్నికల్లో చంద్రబాబు దొంగ ఓట్లతో ఎలా గెలిచారో అన్నీ రుజువులు అప్పగించామన్నారు. ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని ఆయన వెల్లడించారు.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?