*వైసీపీ మూడో జాబితా విడుదల.. కొత్త ఇంఛార్జులు వీరే..
ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే కీలక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జులను నియమించే పనిలో పడ్డారు. తాజగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది. 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. 6 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి జాబితాను వైసీపీ విడుదల చేసింది.
కొత్త ఇంఛార్జులు వీరే..
సూళ్ళూరుపేట- తిరుపతి ఎంపీ గురుమూర్తి
పెడన – ఉప్పాల రాము
చిత్తూరు విజయానంద రెడ్డి
మార్కాపురం -జంకె వెంకట రెడ్డి
రాయదుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి
పూతలపట్టు – డా. సునీల్
విశాఖ(ఎంపీ) – బొత్స ఝాన్సీ
శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్,
ఏలూరు (ఎంపీ)- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ (ఎంపీ)- కేశినేని నాని
కర్నూలు (ఎంపీ)- గుమ్మనూరు జయరాం
తిరుపతి (ఎంపీ) – కోనేటి ఆదిమూలం ( ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే)
ఇచ్ఛాపురం – పిరియా విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి – విజయరామరాజు
దర్శి – బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
ఆలూరు – విరూపాక్షి
కోడుమూరు – డా. సతీష్
గూడూరు – మేరిగ మురళీధర్
సత్యవేడు – డా గురుమూర్తి
*సీఎం రేవంత్ రెడ్డితో మైక్రాన్ కంపెనీ సీఈవో భేటీ
ప్రపంచంలోనే అతి పెద్ద మెమరీ చిప్ తయారీ కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ ప్రెసిడెంట్, సీఈవో సంజయ్ మెహ్రోత్రా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అమెరికా నుంచి ప్రత్యేకంగా సీఎంను కలిసేందుకు వచ్చిన సంజయ్ మెహ్రోత్రా గురువారం సాయంత్రం సీఎం నివాసంలో ఆయనను కలుసుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులకు, పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన వాతావరణం ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. మైక్రాన్ కంపెనీ ఆసక్తి చూపితే రాష్ట్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలను అందిస్తుందని ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. పరిశ్రమల స్థాపన, నైపుణ్యాల అభివృద్ధి, ఉపాధి కల్పనతో పాటు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి పారిశ్రామిక వేత్తలు ముందుకు రావాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. అమెరికాకు చెందిన ఈ సంస్థ సెమీ కండక్టర్ల తయారీలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద కంపెనీ. మెమరీ చిప్ తయారు చేసే అతి పెద్ద సంస్థల్లో ఒకటి.
*రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగింది..
తెలంగాణ లోక్ సభ ఇంచార్జిలతో అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల అంశంపై చర్చించారు. అనంతరం మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పార్లమెంటు కో-ఆర్డినేటర్ల మీటింగ్ జరిగిందని చెప్పారు. పార్లమెంటు సార్వత్రిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకు వెళ్లాలని చెప్పారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ విధంగా కలసికట్టుగా పని చేశారో.. పార్లమెంట్ లో కూడా అదే విధంగా ముందుకు వెళ్లాలని సూచించారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాలను కలుపుకొని ముందుకెళ్లాలని చెప్పారని తెలిపారు. మెజార్టీ సీట్లలో గెలవాలని దిశా నిర్దేశం చేశారన్నారు. దక్షిణ తెలంగాణలో మెజార్టీ సీట్లు గెలుచుకో రావాల్సిన బాధ్యత కోఆర్డినేటర్ అని ఖర్గే చెప్పారని కొండా సురేఖ పేర్కొన్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంటు ఎన్నికల విధివిధానాలపై చర్చ జరిగిందని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు ఖర్గే కొన్ని నియమ నిబంధనలు చెప్పారన్నారు. పార్టీలో ఉన్న వివిధ స్థాయి నేతలు చేయాల్సిన కార్యక్రమాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని పేర్కొన్నారు. కాగా.. నల్గొండ సీటు 3లక్షల ఓట్లతో గెలుస్తుంది.. 14 పార్లమెంట్ స్థానాలు పార్టీ గెలిచే అవకాశం ఉందని చెప్పారన్నారు. అందరూ సమన్వయం చేసుకుంటూ పార్టీని బలోపేతం చేయాలంటూ సూచించారని ఉత్తమ్ కుమార్ తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ చేసామని తెలిపారు. ప్రచారం ఎలా ఉండాలి.. పోల్ మేనేజ్మెంట్, ప్రజలతో మమేకం అవ్వడంపై ఖర్గే మార్గానిర్ధేశం చేశారన్నారు. దేశ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించాలని భావిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో 17 కి 17 స్థానాలు గెలవడమే లక్ష్యంగా పనిచేస్తామని పొన్నం పేర్కొన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రాష్ట్రానికి మరిన్ని నిధులు వస్తాయని అన్నారు. రెండు మూడు స్థానాలకోసం బీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉంటుందని చెప్పారు. గత ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసిందని ఆరోపించారు. 17కి 17 స్థానాల్లో గెలిపిస్తే ఆరు గ్యారెంటీలతోపాటు మరిన్ని సంక్షేమ పథకాలు అందించేందుకు అవకాశం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
*అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట రాజకీయ కార్యక్రమం కాదు..
జనవరి 22న జరిగే అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం ప్రాంతాలు, కులాలకు అతీతంగా ఎదురుచూస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాజకీయాలకు అతీతంగా అయోధ్య రామాలయ ట్రస్ట్ అన్ని వర్గాల ప్రజలను ఆహ్వానిస్తుందని తెలిపారు. బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నేతల తీరు దివాళా కోరుతనానికి నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానం మరోసారి స్పష్టమైందని దుయ్యబట్టారు. రాముడి ప్రాణ ప్రతిష్ట రోజు అయోధ్యకు రాకపోవడం.. రాజకీయ దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుందని మండిపడ్డారు. అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ట రాజకీయ కార్యక్రమం కాదని కిషన్ రెడ్డి తెలిపారు. రాముడి యొక్క ఉనికినే కొట్టివేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బహిష్కరించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయ్యిందని దుయ్యబట్టారు. అటు.. పార్లమెంట్ సమావేశాలను, G 20 సమావేశాలను, ఎన్నికల కమిషన్ సమావేశాలను కాంగ్రెస్ బహిష్కరించారని తెలిపారు. దేశ సమగ్రత దెబ్బతీసే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందని అన్నారు. ముస్లిం మత పెద్దలు, క్రిస్టియన్ మత పెద్దలు జనవరి 22న అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్టకు హాజరు అవుతున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. మరోవైపు.. అయోధ్య రామాలయ అక్షింతలు పంపిణీ చేస్తుంటే.. సికింద్రాబాద్ పోలీసులు కేసు నమోదు చేయడమేంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఎక్కడ లేని విధంగా కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నొప్పి ఏంటి ?.. పోలీసులకు వచ్చిన ఇబ్బంది ఏంటి ? అని ఫైర్ అయ్యారు. వారం రోజులు తర్వాత ఎవరి ఒత్తిడితో కేసులు పెట్టారు ? అని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామ మందిర నిర్మాణంలో సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని చెప్పారు. రాహుల్ యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాహుల్ గాంధీ తిరగాలనుకుంటే చైనా బార్డర్, పాకిస్థాన్ బార్డర్, గోవా బీచ్ లో తిరగమనండి.. ఎవరు వద్దన్నారు అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి ముందుంది ముసళ్ల పండగ అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.
*సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో తిరువూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్, ఆయన సతీమణి సుధారాణి వైసీపీలో చేరారు. వైసీపీ కండువా కప్పి సీఎం జగన్ వారిని పార్టీలోకి ఆహ్వానించారు. 1994, 1999లో రెండు సార్లు తిరువూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యేగా స్వామిదాస్ గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, మొండితోక అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లగట్ల స్వామిదాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి కానున్నారని అన్నారు. ముఖ్యమంత్రి ఏ బాధ్యత ఇస్తే దాన్ని శిరసావహిస్తానన్నారు. అన్ కండీషనల్‌గా పార్టీలో చేరానని ఆయన వెల్లడించారు. చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం గేట్ దగ్గర గంటన్నర నిరీక్షించానని ఆయన చెప్పారు. అవినీతి మచ్చ లేకుండా రాజకీయం చేశానన్నారు. తిరువూరు మా తాతల గడ్డ అని.. గెలిచినా, ఓడినా తిరువూరు ప్రజల కోసం పని చేశానన్నారు.
*ధరణిలో సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్..
ధరణిలో సమస్యల పరిష్కారంపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో సచివాలయంలో ధరణి కమిటీ సభ్యులు సమావేశమయ్యారు. పోర్టల్ ప్రక్షాళనపై కమిటీ చర్చించారు. ధరణిలో భూముల సమస్యలు చాలా ఉన్నాయని కమిటీ తెలిపింది. సీసీఎల్ఎ కార్యాలయం వేదికగా కమిటీ పనిచేస్తోందని చెప్పారు. వారం రోజుల్లో కమిటీ మళ్లీ సమావేశం అవుతుందని అన్నారు. ఆన్ లైన్ లో చాలా భూములు ఎక్కలేదని.. సన్నకారు, చిన్నకారు రైతులు గుంట భూమి అమ్మడానికి ఇబ్బంది పడ్డారన్నారు. గతంలో తప్పులు పునరావృతం కాకుండా అడుగులు వేస్తామని తెలిపారు. ధరణిలో ఇప్పటి వరకు 119 లోపాలను గుర్తించినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. పటిష్టమైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరం అని పేర్కొన్నారు. ఆర్వో యాక్ట్ ఉన్నప్పటికీ.. స్పష్టమైన గైడ్ లైన్స్ లేకపోవడంతో సమస్యలు వస్తున్నాయని గుర్తించారు. రెవెన్యూలో సరైన బిజినెస్ రూల్స్ లేవని.. రెవెన్యూలో అధికార వికేంద్రీకరణ లేకపోవడం వల్ల సమస్య ఉత్పన్నం అయినప్పుడు కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. ఇక నుంచి భూ సమస్యలు వస్తే అధికార వికేంద్రీకరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మండల స్థాయిలో భూ సమస్యలను పరిష్కరించేందుకు.. డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిల్లో మార్గదర్శకాలు విడుదల చేయనుంది ధరణి కమిటీ.
*చికెన్ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. ఒక్కసారి పడిపోయిన ధరలు..
చికెన్ ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్. చికెన్ ధరలు మరోసారి తగ్గాయి.. గతకొన్ని రోజులుగా పెరుగుతోన్న చికెన్ ధరలు ఇప్పుడు భారీగా తగ్గాయి. కార్తీక మాసం కావడంతో చికెన్ ధరలు భారీగా పడిపోయాయి. మళ్లీ న్యూయర్ కు ధరలు డబుల్ అయ్యాయి.. ఇప్పుడు చికెన్ ధర సగానికి పడిపోయింది.. ఈరోజు ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.. మొన్నటివరకు కార్తీక మాసంతో ధరలు ఒక్కసారిగా సగానికి సగం తగ్గాయి. దీంతో ప్రస్తుతం కిలో చికెన్ విత్ స్కిన్ రూ. 150, స్కిన్‌లెస్ రూ. 170కి పడిపోయింది. గడిచిన నాలుగు నెలల్లో కిలో చికెన్ ధర చేరుకున్న కనిష్ట ధర ఇదే కావడం విశేషం. కోళ్లు ఒక పరిమాణానికి వచ్చిన తర్వాత కచ్చితంగా వాటిని అమ్మేయాల్సిందే. లేదంటే వాటికి మేత ఎక్కువవడంతో పాటు అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఉంటాయి. దీంతో మార్కెట్లో డిమాండ్ తగ్గి, భారీగా కోళ్లు రావడంతో ఆటోమేటిగ్‌గా ధర తగ్గుతుంది.. క్రిష్టమస్ తర్వాత చికెన్ ధరలు భారీగా పెరిగాయి.. దాంతో పాటుగా కోడిగుడ్డు ధరలు కూడా భారీగా పెరిగాయి.. అయితే.. తాజాగా సంక్రాంతి పండుగ సమీపిస్తోన్న వేళ చికెన్ ప్రియులకు ఊరటనిచ్చేలా ఏపీలో కిలో చికెన్ ధర రూ.120 కి తగ్గింది.. క్రిష్టమస్ కు రూ. 250కు చేరుకున్న చికెన్ ధర రీసెంట్‌గా స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.150-160, విత్ స్కిన్ రూ. 120 -130 గా ఉంది. ఆహారంలో రోజూ భాగం చేసుకునే గుడ్ల ధరలు మాత్రం భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఒకవైపు చలి తీవ్రత ఎక్కువ.. కొన్ని ప్రాంతాల్లో అయితే చికెన్ ధరలు ఏకంగా 40 శాతం అమ్మకాలు తగ్గిపోయాయి. కార్తీక మాసం ముగిసే సమయానికి చికెన్ ధరలు ఇలాగే ఉండే అవకాశాలున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు..
*అధ్యక్ష పాలన దిశగా దేశం.. “వన్ నేషన్-వన్ ఎలక్షన్”పై మమతా బెనర్జీ..
తృణమూల్ కాంగ్రెస్ సుప్రీమో, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ‘‘వన్ నేషన్-వన్ ఎలక్షన్’ని వ్యతిరేకించారు. దీనిపై ప్యానెల్ కార్యదర్శి నితేన్ చంద్రకు లేఖ రాశారు. ఏక కాలంలో దేశవ్యాప్తంగా ఎన్నికలను తాము ఒప్పుకోమని చెప్పారు. జమిలి ఎన్నికలకు ‘‘ అధ్యక్ష పరిపాలనకు ఒక అడుగు’’ అని పేర్కొంది. ఈ తరహా విధానం భారత రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి వ్యతిరేకమన్నారు. ఇది ప్రజాస్వామ్య ముసుగులో నియంత్రుత్వానికి దారి తీస్తుందని, తాము నియంతృత్వానికి వ్యతిరేకమని, అందుకే తాము జమిలి ఎన్నికలకు దూరమని మమతా రామ్‌నాథ్ కోవింద్ ప్యానెల్‌కి లేఖ రాశారు. వన్ నేషన్-వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ స్పష్టంగా లేదని దీనితో మేం విభేదిస్తున్నామని దీదీ లేఖలో పేర్కొన్నారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ కారణాల వల్ల తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయకపోవచ్చు, గత 50 ఏళ్లలో లోక్‌సభ అనేక సార్లు ముందస్తుగా రద్దైంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా ఎన్నికలు నిర్వహించడమే మార్గం, కేవలం ఏకకాలంలో ఎన్నికలకు వెళ్లాలని రాష్ట్రాలపై ఒత్తిడి తేవద్దు, ఇలా చేస్తే 5 ఏళ్ల పాలనపై ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారని లేఖలో మమతా బెనర్జీ పేర్కొంది. భారత రాజ్యాంగం కూడా వన్ నేషన్-వన్ ఎలక్షన్ విధానాన్ని అనుసరించడం లేదని అన్నారు. కేంద్రం వన్ నేషన్-వన్ ఎలక్షన్‌పై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇటీవల సూచనలు చేయాలని ప్రజల్ని, పార్టీలను కోరింది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఈ ఎన్నికల విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
*దేశంలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. గడిచిన 24 గంటల్లో 514 కేసులు..
గత కొన్ని రోజులుగా కరోనా కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి.. ఒకవైపు వ్యాక్సిన్స్ వేసినా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. భారతదేశంలో 514 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి, అయితే సంక్రమణ యొక్క క్రియాశీల కేసుల సంఖ్య 3,422 కు తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది.. 24 గంటల్లో మూడు మరణాలు – మహారాష్ట్రలో రెండు మరియు కర్ణాటకలో ఒకటి – ఉదయం 8 గంటలకు నవీకరించబడిన మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం. డిసెంబర్ 5, 2023 వరకు రోజువారీ కేసుల సంఖ్య రెండంకెలకు పడిపోయింది, అయితే కొత్త ఉప-వేరియంట్ — JN.1 — మరియు చల్లని వాతావరణ పరిస్థితుల ఆవిర్భావం తర్వాత కేసులు పెరగడం ప్రారంభించాయి. డిసెంబరు 5 తర్వాత, డిసెంబర్ 31, 2023న గరిష్టంగా 841 కొత్త కేసులు ఒక్క రోజులో నమోదయ్యాయి, ఇది మే 2021లో నమోదైన గరిష్ట కేసుల్లో 0.2 శాతం అని అధికారిక వర్గాలు తెలిపాయి.. మొత్తం యాక్టివ్ కేసుల్లో దాదాపు 92 శాతం మంది హోమ్ ఐసోలేషన్‌లో కోలుకుంటున్నారు.ప్రస్తుతం అందుబాటులో ఉన్న డేటా JN.1 సబ్-వేరియంట్ కొత్త కేసులలో ఘాతాంక పెరుగుదలకు లేదా ఆసుపత్రిలో చేరడం మరియు మరణాల పెరుగుదలకు దారితీయదని సూచిస్తుంది” అని అధికారిక మూలం పేర్కొంది. ఏప్రిల్-జూన్ 2021 మధ్యకాలంలో డెల్టా వేవ్ సమయంలో రోజువారీ కొత్త కేసులు మరియు మరణాల గరిష్ట సంభవం నమోదవడంతో భారతదేశం గతంలో COVID-19 యొక్క మూడు తరంగాలను చూసింది..గరిష్టంగా, మే 7, 2021న 414,188 కొత్త కేసులు మరియు 3915 మరణాలు నమోదయ్యాయి.. మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, వ్యాధి నుండి కోలుకున్న వారి సంఖ్య జాతీయ రికవరీ రేటు 98.81 శాతంతో 4.4 కోట్లకు పైగా ఉంది. వెబ్‌సైట్ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.67 కోట్ల డోస్‌ల COVID-19 వ్యాక్సిన్‌లు నిర్వహించబడ్డాయి…