అంగన్వాడీ సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొలిక్కిరాలేదు. ఈ చర్చలు విఫలమయ్యాయి. 2024 జులైలో జీతాలు పెంచుతామని ప్రభుత్వం చెప్పింది. జీతాల పెంపుపైనే అంగన్వాడీ వర్కర్లు, సహాయకులు పట్టుబట్టారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి జీతాలు పెంచుతాం అని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కోసిగి మండలం నుండి కౌతాళం మండలం హాల్వి గ్రామం వరకు అధ్వాన్నంగా తయారైన రోడ్డును చూసి, నిరసన వ్యక్తం చేశారు మంత్రాలయం నియోజకవర్గం టీడీపీ ఇంఛార్జి పాలకుర్తి తిక్కారెడ్డి.
పెనమలూరు టీడీపీలోకి ఎమ్మెల్యే పార్థసారథి రాక రచ్చ రేపుతోంది. ఎమ్మెల్యే పార్థసారథి టీడీపీలో చేరిక ఖాయం కావటంతో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ వర్గం ఆందోళనకు గురవుతోంది. సీటుకు ఎసరుపెట్టేలా తాజా రాజకీయ పరిణామాలు జరుగుతుండడంతో టికెట్ రాదేమోననే ఆందోళనలో బోడే ప్రసాద్ ఉన్నట్లు తెలుస్తోంది.
విజయవాడలోని గొల్లపూడిలో దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ విభాగాల యూనిట్ టేబుల్ క్యాలెండర్‌ను దేవాదాయ శాఖ చీఫ్ ఇంజినీర్ సుసర్ల శ్రీనివాసరావు తమ చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఎన్నికల వేళ ప్రతిపక్ష టీడీపీకి షాకుల మీదు షాకులు తగులుతున్నాయి. టీడీపీ సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు. విజయవాడ, గుంటూరులలో కేశినేని, రాయపాటి కుటుంబాలు అండగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ కుటుంబాలు సైకిల్ దిగాయి. గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేత పార్టీకి గుడ్‌బై చెప్పారు.
వైద్య, ఆరోగ్యశాఖపై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహించారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2పై సమావేశంలో చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనేదానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్యచికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు.
కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు చంద్రబాబు నివాసంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. గన్నవరం టీడీపీ ఇంఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు లోకేష్‌ను కలిశారు. కేశినేని నాని పార్టీ వీడిన తర్వాత జరుగుతోన్న పరిణామాలపై చర్చించినట్లు తెలిసింది.
తిరుమలలో మరో డ్రోన్ కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులోని 53వ మలుపు వద్ద నిబంధనలకు విరుద్దంగా డ్రోన్ కెమెరా సాయంతో అసోంకు చెందిన ఆర్మీ కమాండర్, అతని భార్య కలిసి తిరుమల కొండలను వీడియో తీశారు.