Mudragada Padmanabham: ఏపీలో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. రాష్ట్రంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ తరుణంలో కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం వైపు పార్టీలు చూస్తున్నాయి. ఏపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు 12 నుండి 15 శాతం ఉంటాయి. ఆయా పార్టీల గెలుపు, ఓటములను కాపు సామాజిక వర్గం ఓటర్లు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ల సాధన కోసం గత కొంత కాలంగా ముద్రగడ పద్మనాభం పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీలో చేరాలంటూ కాకినాడ జిల్లాలో కిర్లంపూడిలో ఉన్న ముద్రగడ పద్మనాభం ఇంటికి పార్టీలు క్యూ కడుతున్నాయి.
Read Also: Shock to TDP: టీడీపీకి మరో షాక్.. వైసీపీలో చేరనున్న మాజీ ఎమ్మెల్యే!
ముద్రగడ పద్మనాభాన్ని తమ వైపుకు తిప్పుకునేందుకు అధికార వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. కొత్త ఏడాది సందర్భంగా ముద్రగడ పద్మనాభం ఇంటకి కాపు నేతలు, అనుచరులు భారీగా తరలివచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పొలిటికల్ రీఎంట్రీ గ్రాండ్‌గా ఇస్తారనే ప్రచారం జరిగింది. ముద్రగడ కొడుకు లేదా కోడలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరిగింది. వైసీపీ నేతలు కూడా ముద్రగడ పద్మనాభంతో టచ్‌లోకి వెళ్లినట్లు చర్చ జరిగింది. తన తండ్రి ఆదేశిస్తే రాజకీయాల్లోకి రావడానికి ముద్రగడ పద్మనాభం కుమారుడు కూడా ప్రకటించిన సంగతి విదితమే. అయితే ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.
Read Also: Tiruvuru MLA: పార్టీకి దూరంగా తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి!.. సీఎంవో నుంచి ఫోన్..
ఇదిలా ఉంటే ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం ఇంటికి పార్టీలు క్యూ కట్టాయి. బుధవారం సాయంత్రం ముద్రగడను జనసేన నేత బోలిశెట్టి శ్రీనివాస్ కలిశారు. ఆయన జనసేన పార్టీలోకి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామని ఆయన ప్రకటించారు. ఉదయం పద్మనాభంతో టిడిపి నేత జ్యోతులను నెహ్రు బ్రేక్ ఫాస్ట్ చేశారు. తమ పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. ఇదిలా ఉండగా.. వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ముద్రగడతో సమావేశం కానున్నట్లు తెలిసింది. మూడు పార్టీల కాపు నేతలు పద్మనాభంతో చర్చలు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది. అన్ని పార్టీల నేతలు ముద్రగడ పద్మనాభాన్ని తమ పార్టీల్లో చేరాలని కోరుతున్నారు. ముద్రగడ పద్మనాభం ఏ పార్టీలో చేరుతారనేది ప్రస్తుతం అంతా ఆసక్తికరంగా చూస్తున్నారు.