YSRCP 3rd List: ఏపీలో రెండోసారి అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలోనే కీలక మార్పులకు సీఎం జగన్ శ్రీకారం చుట్టారు. వై నాట్ 175 నినాదంతో ముందుకెళ్తున్న జగన్.. నియోజకవర్గాల్లో బలమైన ఇంఛార్జులను నియమించే పనిలో పడ్డారు. తాజగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌ల మార్పులపై వైసీపీ మూడో జాబితాను విడుదల చేసింది. 21 మందితో మూడో జాబితాను విడుదల చేసింది. 6 ఎంపీ స్థానాలు, 15 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి జాబితాను వైసీపీ విడుదల చేసింది. తాడేపల్లిలో గురువారం పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. వీటితో పాటు ప్రస్తుతం ఇచ్ఛాపురం జడ్పీటీసీగా ఉన్న ఉప్పాడ నారాయణమ్మను.. శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ వైసీపీ అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది.
కొత్త ఇంఛార్జులు వీరే..
సూళ్ళూరుపేట- తిరుపతి ఎంపీ గురుమూర్తి
పెడన – ఉప్పాల రాము
చిత్తూరు విజయానంద రెడ్డి
మార్కాపురం -జంకె వెంకట రెడ్డి
రాయదుర్గం – మెట్టు గోవింద్ రెడ్డి
పూతలపట్టు – డా. సునీల్
విశాఖ(ఎంపీ) – బొత్స ఝాన్సీ
శ్రీకాకుళం (ఎంపీ) – పేరాడ తిలక్,
ఏలూరు (ఎంపీ)- కారుమూరి సునీల్ కుమార్ యాదవ్
విజయవాడ (ఎంపీ)- కేశినేని నాని
కర్నూలు (ఎంపీ)- గుమ్మనూరు జయరాం
తిరుపతి (ఎంపీ) – కోనేటి ఆదిమూలం ( ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యే)
ఇచ్ఛాపురం – పిరియా విజయ
టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
చింతలపూడి – విజయరామరాజు
దర్శి – బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి
మదనపల్లె – నిస్సార్ అహ్మద్
రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
ఆలూరు – విరూపాక్షి
కోడుమూరు – డా. సతీష్
గూడూరు – మేరిగ మురళీధర్
సత్యవేడు – డా గురుమూర్తి